Miyapur: మియాపూర్ మెట్రోస్టేషన్ సమీపంలో చిరుత సంచారం కలకలం రేపిన విషయం తెలిసిందే.. చిరుత సంచరిస్తోందని తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చిరుత సంచరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు, అటవీ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని ఆనవాళ్లు గుర్తించారు. మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో సంచరించింది అడవి పిల్లిగా అటవీశాఖ అధికారులు తేల్చారు. అక్కడ సంచరించింది చిరుత కాదని అడవి పిల్లి అని నిర్ధారించారు. దీంతో మియాపూర్ వాసులు భయాందోళన గురికావల్సిన పనిలేదని తెలిపారు. ఇలాంటి వీడియో ఒకటి రెండు సార్లు పరిశీలించిన తరువాత సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని సూచించారు. ఇలాంటి వీడియోలతో ప్రజలు భయ భ్రాంతులు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు.
Miyapur: మియాపూర్ లో సంచరించింది చిరుత కాదు.. అటవీ శాఖ ఏమన్నారంటే..
- మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో సంచరించింది అడవి పిల్లి..
- నిన్న మియాపూర్ మెట్రో స్టేషన్ పరిధిలో చిరుత సంచరిస్తున్నట్లు వీడియో వైరల్..
- అడవి పిల్లిగా తేల్చిన అధికారులు- ఊపిరి పీల్చుకున్న స్థానికులు..