NTV Telugu Site icon

Telangana Tourism: పర్యాటకులకు శుభవార్త.. సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణ సేవలు..

Srisailam Tour

Srisailam Tour

Telangana Tourism: నేటి సమాజంలో సమయాన్ని బిజీ బిజీగా గడిపేస్తున్నాం. కానీ వీకెండ్‌ మాత్రం కుటుంబ సభ్యులు, స్ర్నేహితులతో గడపాలని ప్లాన్‌ వేసుకుంటాం. ఆరోజు వారితో గడిపే క్షణాలు కోసం వారమంతా ఎదురుచూస్తాం. అయితే వారితో గడిపేందుకు హైదరాబాద్‌ లోని దగ్గరలో ఉండే ఏదైనా టూరిస్టు స్పాట్ లను వెతుకుతుంటాము. అలాంటి వారికోసం తెలంగాణ టూరిజం శాఖ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. సోమశిల టు శ్రీశైలం వరకు లాంచీ సేవలను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. శ్రీశైలం డ్యాం బ్యాక్‌వాటర్‌లో చేపట్టనున్న ఈ పర్యటన ఆహ్లాదకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు.

Read also: Nandamuri Tarakaratna : తారకరత్న కుమార్తె హాఫ్ శారీ ఫంక్షన్.. కుందనపు బొమ్మలా ఎంత బాగుందో !

తెలంగాణ టూరిజం రోడ్​ కమ్​ రివర్​క్రూజ్​ టూర్ (ROAD CUM RIVER CRUISE TOUR) పేరుతో హైదరాబాద్-శ్రీశైలం- సోమశిల-హైదరాబాద్ వరకు ప్యాకేజీ ఆపరేట్‌ చేస్తోంది. ఈ లింక్‌ ద్వారా వాటి వివరాలు సేకరించవచ్చని తెలిపింది. https://tourism.telangana.gov.in/blogpage?id=14 క్లిక్‌ చేస్తే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మొత్తం రెండు రోజుల పాటు టూర్‌ నిర్వహిస్తారు. ప్రతి శని, ఆదివారల్లో ఈ టూర్‌ ను ఉంటుందని తెలిపారు. శ్రీశైలం డ్యాం బ్యాక్‌వాటర్‌లో చేపట్టనున్న ఈ పర్యటన ఆహ్లాదకరంగా ఉంటుందని పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని సోమశిల నుండి శ్రీశైలం వరకు సింగిల్ రైడ్ , రౌండప్ క్రూయిజ్ జర్నీ ధరలు కూడా ప్రకటించారు.

Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

వివరాలు ఇలా ఉన్నాయి..

* పెద్దలకు రూ.2,000, పిల్లలకు వన్-వే జర్నీకి రూ.1,600, పెద్దలకు రూ.3,000, పిల్లలకు రౌండ్ ట్రిప్ (పైకి క్రిందికి) రూ.2,400గా టికెట్ ధరలు నిర్ణయించారు.
* ప్రయాణికులకు భోజన సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ నెల 26 నుంచి ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని లాంచీ మేనేజర్ శివకృష్ణ తెలిపారు.
* తొలిరోజు ఉదయం 9 గంటలకు బషీర్‌బాగ్‌లోని సీఆర్‌వో కార్యాలయం నుంచి శ్రీశైలానికి బస్సుయాత్ర ప్రారంభమవుతుంది. శ్రీశైలం చేరుకుని హోటల్‌లో చెక్ ఇన్ చేయండి.
* అనంతరం శ్రీభామరాంబ మల్లిఖార్జున స్వామివారి దర్శనం ఉంటుంది. వీలైతే ఆ సాయంత్రం ఆనకట్ట సందర్శన ఉంటుంది. ఇక ఆ రాత్రి శ్రీశైలంలో బస చేయాల్సి ఉంటుంది.
* రెండో రోజు ఉదయం తొమ్మిది గంటలకు శ్రీశైలం నుంచి సోమశిలకు ప్రయాణిస్తారు. కానీ ఇక్కడ ప్రయాణం శ్రీశైలం నుండి సోమశిల వరకు విహార యాత్ర (పడవ). సాయంత్రం వరకు అక్కడే ఎంజాయ్ చేస్తారు.
* సాయంత్రం 5 గంటలకు సోమశిల నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. రాత్రి 9 గంటలకు భాగ్యనగరం చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.
* ప్రయాణ వివరాలు, టిక్కెట్ బుకింగ్ సమాచారం కోసం https://tourism.telangana.gov.in/blogpage?id=14 లింక్ లేదా మొబైల్ నంబర్ 7731854994ను సంప్రదించాలని కోరారు.
CM Revanth: ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలకు సీఎం క్లారిటీ..