NTV Telugu Site icon

Begum Bazar Land: బేగంబజార్‌లో భూమి ధర ముంబయితో పోటీ.. గజానికి రూ.10 లక్షలు..!

Begumbazar

Begumbazar

Begum Bazar Land: హైదరాబాద్ బేగంబజార్ తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్. హైదరాబాద్‌లోని ప్రసిద్ది చెందిన బేగంబజార్‌లో భూములు, భవనాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. గతంలో గజం భూమి ధర రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు మాత్రమే ఉండగా ఇప్పుడు బేగంబజార్ లో భూముల ధర ముంబైతో పోటీ పడుతోంది. ముంబైలో మాదిరిగా ఇక్కడ కూడా గజం స్థలం రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంది. వీధిని బట్టి గజం ధర కనీసం రూ.20 లక్షలు మరియు ప్రైమ్ ఏరియాల్లో రూ.25 లక్షల వరకు ఉంటుంది. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూ.10 నుంచి రూ.20 లక్షలకు పెరిగింది. ఇప్పుడు కూడా చదరపు అడుగు ధర రూ.70 నుంచి రూ.80 వేలు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఐటీ కారిడార్ ప్రాంతాల్లో కూడా చదరపు అడుగు ధర రూ.20 వేలకు మించడం లేదు. అయితే ఇక్కడ ఒక్కసారిగా ధరలు పెరగడం విశేషం.

Read also: CM Revanth Reddy: ఈరోజు తప్పితే దసరా వరకు కుదరదట.. భూమి పూజపై రేవంత్‌ కీలక వ్యాఖ్యలు..

భవిష్యత్తులో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. బేగంబజార్‌లో ఖాళీ లేదు. పాత, శిథిలావస్థలో ఉన్న భవనాలు వాటి యజమానులకు బంగారంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో పాత భవనాలను కూల్చివేసి కొత్త భవనాలు నిర్మించినా ఇప్పుడు పాత భవనాలకు గిరాకీ పెరిగింది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల దృష్టి బేగంబజార్ వైపు మళ్లింది. పాత భవనాల విక్రయాలపై నిత్యం ఆరా తీస్తున్నారు. అందరికంటే ఎక్కువ ఇచ్చేందుకు పోటీ పడుతున్నారు. ఒకరిపై ఒకరు రేటు పెంచడంతో వ్యాపారుల మధ్య పోటీ వేలంపాటను తలపిస్తున్నదంటే అతిశయోక్తి కాదు. భూమి అందుబాటులో లేకపోవడంతో పాత భవనాలు కొత్త నిర్మాణాలకు పునాది వేస్తున్నాయి. రాజస్థాన్, గుజరాత్, యూపీ, మహారాష్ట్ర నుండి చాలా మంది టోకు వ్యాపారులు ఇక్కడ స్థిరపడ్డారు. చదరపు అడుగుకు విక్రయించే మడిగ దుకాణాల ధరలు కూడా రూ. కోట్లలో పలుకుతున్నాయి.
Constables Suspended: లంచాలు, యువతులతో ఖాకీల రాసలీలు.. సస్పెండ్ చేసిన హైదరాబాద్ సీపీ

Show comments