KTR: మానవత్వంతో ముందడుగు వేయాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. తన సత్యాగ్రహంతో భారతజాతినే కాకుండా ప్రపంచాన్ని మేల్కొల్పిన గొప్ప మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అన్నారు. ఆయన జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో ఉండే అత్యంత బలహీనమైన వ్యక్తిని, ఆ సమాజం, ఆ ప్రభుత్వం ఎట్లా ఆదరిస్తున్నదనే దాన్నిబట్టి ఆ ప్రభుత్వం యొక్క వ్యవస్థ యొక్క గొప్పతనం తెలుస్తుందని మహాత్మా గాంధీ స్వయంగా చెప్పారన్నారు. ఈ మాట సరిగ్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడు గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. సమాజంలోని బలహీనుల పట్ల కర్కశత్వంతో వ్యవహరించాల్సిన అవసరం లేదన్నారు. ఈ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తుంది ఈ అంశంలో పునరాలోచించుకోవాలన్నారు. రాష్ట్రంలోని ప్రజలు పేదలంతా బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Read also: Rowdy Gang: వరంగల్ లో రెచ్చిపోతున్న రౌడీ గ్యాంగ్.. అమాయకులపై దాడులు..
ఇండ్లు కూల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కూలీలు కూడా ఇల్లు కూలగొట్టలేమంటూ మాతో తిరిగి వెళ్ళిపోయారన్నారు. ప్రజలు మిమ్మల్ని గెలిపించింది నిర్మాణాత్మక పనులు చేయమని కానీ విధ్వంసం సృష్టించమని కాదనే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు. మేము రెండున్నర లక్షల ఇండ్లు కడితే మిమ్మల్ని అయిదు లక్షల ఇల్లు కట్టమని ఓటేసినారు కానీ ఉన్న ఇండ్లను కూలగొట్టమని కాదని తెలిపారు. కానీ సమాజంలోని అత్యంత వెనుకబడిన వారిపట్ల కర్కషంగా అమామానవీయంతో వ్యవహరిస్తున్న ఈ కాంగ్రెస్ సర్కారు తీరు బాధాకరం అన్నారు. ఈ గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఉన్న ప్రస్తుత గాంధీలు ఈ ప్రభుత్వ అమానవీయమైన పాలనపై స్పందించాలన్నారు. డీపీఆర్ అనేది లేకుండా ఇండ్లు కులగొట్టే దుర్మార్గమైన ప్రయత్నాలను విరమింపచేయాలన్నారు. మానవత్వంతో ముందడుగు వేయాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
Jagtial Residential in Iraq: సార్ మమ్మల్ని కాపాడండి.. ఇరాక్ లో జగిత్యాల వాసుల కష్టాలు..