KTR Warning Tweet: మళ్లీ చెప్తున్నా రాసి పెట్టుకో.. విగ్రహాలను తొలగిస్తాం..
- కాంగ్రెస్ నాయకుల విగ్రహాలేమిటని అడిగితే కారుకూతలు కూస్తావా?..
- నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Warning Tweet: మళ్ళీ చెప్తున్నాం, రాసి పెట్టుకో.. తెలంగాణకు అక్కరకురాని వాళ్ళ బొమ్మలను తొలగిస్తామని కేటీఆర్ ట్వీట్ వైరల్ గా మారింది. సోనియాగాంధీని దయ్యం, పిశాచి, బలిదేవత అన్న నువ్వా రాజీవ్ గాంధీమీద ప్రేమ ఒలకబోసేది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దొడ్డి దారిన పీసీసీ ప్రెసిడెంట్ అయ్యి.. ఇవాళ రాజీవ్ గాంధీ మీద నువ్వు ఒలకబోస్తున్న కపట ప్రేమ.. అసలురంగు అందరికీ తెలుసని కీలక వ్యఖ్యలు చేశారు. నీ ఆలోచనల్లో కుసంస్కారం… నీ మాటలు అష్ట వికారం అంటూ మండిపడ్డారు.
Read also: Delhi Liquor Case: సీబీఐ ఛార్జ్‌షీట్‌పై విచారణ సెప్టెంబర్ 11వ తేదీ వాయిదా..
Also Read
- Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
- CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
తెలంగాణ తల్లి కోసం నిర్ణయించిన స్థలంలో కాంగ్రెస్ నాయకుల విగ్రహాలేమిటని అడిగితే కారుకూతలు కూస్తావా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం గుండెల్లో గునపాలు దించిన.. నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహం గాడ్సే పెడితే ఎట్లుంటదో అట్లుంటది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ చెప్తున్నాం, రాసి పెట్టుకో.. తెలంగాణకు అక్కరకురాని వాళ్ళ బొమ్మలను తొలగిస్తాం.. తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్టిస్తాం.. జై తెలంగాణ అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
Read also: Jagadish Reddy: మోడీ దగ్గర రేవంత్ రెడ్డి కి ఉన్న ప్రాధాన్యత కిషన్ రెడ్డి , బండి లకు లేదు..
రాష్ట్ర సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. డిసెంబరు 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం చేసిన రోజే (డిసెంబర్ 9) తెలంగాణ తల్లి పండుగను నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పేందుకు గత పాలకులకు చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ నాయకులను విమర్శించారు. విగ్రహ ప్రతిష్ఠాపనను తెరవెనుక చేశారని మండిపడ్డారు. గత పాలకులు తెలంగాణ వారిదే అన్నట్లుగా వ్యవహరించారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Jagadish Reddy: మోడీ దగ్గర రేవంత్ రెడ్డి కి ఉన్న ప్రాధాన్యత కిషన్ రెడ్డి , బండి లకు లేదు..
తాజావార్తలు
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!