NTV Telugu Site icon

KTR: తెలంగాణ తల్లిని అవమానిస్తారా..?

Ktr

Ktr

KTR: హైదరాబాద్ నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ముందు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు (సోమవారం) సాయంత్రం 4 గంటలకు ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా మాజీమంత్రి కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.

తెలంగాణ తల్లిని అవమానిస్తారా ?
తెలంగాణ ఆత్మతో ఆటలాడతారా ?
తెలంగాణ అస్తిత్వాన్నే కాలరాస్తారా ?
తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ఊపిరి తీస్తారా?
తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తారా ?
తెలంగాణ మలిదశ పోరాట దిక్సూచిని దెబ్బతీస్తారా ?
తెలంగాణ అమరజ్యోతి సాక్షిగా ఘోర అపచారం చేస్తారా ?

తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు.. తుచ్ఛమైన.. స్వార్థ రాజకీయాలకు తెరతీస్తారా ?

నాలుగు కోట్ల ప్రజల గుండెచప్పుడైన..
“తెలంగాణ తల్లి” విగ్రహం పెట్టాల్సిన చోట..
“రాహుల్ గాంధీ తండ్రి” విగ్రహం పెడతారా.. ??
తెలంగాణ కాంగ్రెస్ ను క్షమించదు..! అంటూ కేటీఆర్ రాసుకొచ్చారు.

Read Also: SC Classification: నేడు జలసౌదాలో ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ..

దీంతో పాటు ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ‘ప్రధాని మోదీ జీ, మీరు తెలంగాణలో ‘RR టాక్స్’ గురించి మాట్లాడి 4 నెలలు అయిపోయింది.. దానిపై మీ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోకపోవడానికి ఏదైనా నిర్దిష్ట కారణం ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోందని మీరు చెప్తు్న్నప్పటికి.. మీ కేబినెట్‌ మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు ‘ఆర్‌ఆర్‌ టాక్స్‌’ గురించి ఎందుకు మాట్లాడడం లేదన్నారు. వారు మీతో ఏకీభవించలేదా లేదంటే మీ విమర్శలు కేవలం ఎన్నికల వరకేనా అంటూ ట్వీట్ చేశారు.