NTV Telugu Site icon

KTR Tweet: కాంగ్రెస్ పై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతాం.. అప్పుల అంశంపై కేటీఆర్‌ ట్వీట్..

Ktr

Ktr

KTR Tweet: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.. బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ అధోగతి పాలయ్యిందని, కేసీఆర్‌ రూ.7 కోట్లు అప్పులు చేశారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ నేతలు ఖండించారు. ఇవాళ (సోమవారం) ఎక్స్ వేదిక ద్వారా అప్పుల వ్యవహారంపై కేటీఆర్ స్పందించారు.

Read also: Ex MLA Shakeel Son: నేడు పోలీసుల విచారణకు మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్..

రాష్ట్ర అప్పులు రూ.7 లక్షల కోట్లు అని చెప్పి అసెంబ్లీని, తెలంగాణ ప్రజలను పదే పదే తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతాం. ఆర్‌బీఐ నివేదిక ప్రకారం.. అప్పు కేవలం రూ. 3.89 లక్షల కోట్లు. అయితే అప్పుల గురించి ఆర్థిక మంత్రి ప్రసంగం రూ. 7 లక్షల కోట్లు అనేది పూర్తిగా అవాస్తవమని కేటీఆర్ పేర్కొన్నారు. భారత రాష్ట్రాలపై గణాంకాల హ్యాండ్‌ బుక్ నివేదిక తేల్చిచెప్పిందని అన్నారు. ఆర్థిక మంత్రి ఉద్దేశపూర్వకంగానే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పులపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తూ ప్రతిష్టను దిగ జార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తెలంగాణ శాసనసభ విధివిధానాల రూల్ 168 (1) కింద ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు బీఆర్‌ఎస్ శాసన సభా పక్షం పార్టీ తరపున సభా హక్కుల ఉల్లంఘన నోటీసును అందజేస్తున్నామని కేటీఆర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Telangana Cabinet Meeting: నేడు రాష్ట్ర కేబినెట్‌ సమావేశం.. అసెంబ్లీ కమిటీహాల్‌లో భేటీ..

Show comments