Site icon NTV Telugu

KTR: నేడు గ్రేటర్‌ కార్పొరేటర్లతో కేటీఆర్‌ కీలక సమావేశం..

Ktr

Ktr

KTR: తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, సనత్‌నగర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధ్యక్షతన గ్రేటర్‌ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లతో సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు జరిగే ఈ సభకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. శనివారం జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సమావేశం (మండలి) నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అనుసరించాల్సిన వ్యూహాలపై మండలిలో చర్చించాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

Read also: Market Mahalakshmi OTT: ఓటీటీలోకి “మార్కెట్ మహాలక్ష్మి”.. స్ట్రీమింగ్ ఎక్కడఅంటే..?

రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో రాహుల్ గాంధీ విఫలమయ్యారని కేటీఆర్ విమర్శించారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌కు కట్టుబడి ఉన్నామని చెబుతూ.. ఇతర పార్టీల్లో గెలిచిన వారిని కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపులను అడ్డుకుంటామన్న రాహుల్ మాటలను దేశం ఎలా నమ్ముతుందని ప్రశ్నించారు. రాహుల్‌కు మేనిఫెస్టోపై చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని కోరారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత భారత ఎంపీ కేశవ రావు రాజ్యసభకు రాజీనామాచేయడాన్ని స్వాగ తిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
S Jaishankar: ఆమోదయోగ్యం కాదు.. రష్యన్ సైన్యంలో భారతీయులపై ఎస్ జైశంకర్

Exit mobile version