NTV Telugu Site icon

KTR: జగన్ ఓటమిపై కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. అది ఆశ్చర్యం కలిగించింది..!

Ktr

Ktr

KTR: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా.. వైఎస్‌ జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.. అయినా, 40 శాతం ఓట్లు సాధించడం మాములు విషయం కాదన్నారు.. అయితే, ఏపీ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవని మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్నారు.. మరోవైపు, ప్రతిరోజూ జనంలోకి వెళ్లే కేతిరెడ్డి ఓడిపోవడం ఊహించలేమన్నారు. జగన్ ను ఓడించేందుకు షర్మిలను ఒక వస్తువులా ఉపయోగించారు.. అంతకు మించి షర్మిల ఏమీ లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read Also: Bandi Sanjay: ఎములాడ, కొండగట్టు, ఇల్లంతకుంట ఆలయాలను అభివృద్ధి చేస్తా..

ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్‌ ఓటమిపై స్పందించిన ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్.. ప్రజలతో మాకు గ్యాప్ వచ్చింది.. ప్రజలది తప్పనీ అనలేం.. మేం మారాలి అన్నారు.. అయితే, హైదారాబాద్ లో అన్ని సీట్లు గెలిచాం అని గుర్తుచేశారు.. కానీ, రాష్ట్రంలో మేం చేసిన అభివృద్ధిని మేమే చెప్పుకోలేదన్నారు.. అసలు, తెలంగాణ పేరు మార్చడం (టీఆర్ఎస్‌ ను బీఆర్ఎస్‌గా) వల్ల ఓడిపోయామనడానికి ఆధారం లేదన్నారు.. మాకు అహంకారం ఉందని కృత్రిమంగా సృష్టించారు.. ఆత్మవిశ్వాసం, అహంకారానికి తేడా తెలియదు..! అని మండిపడ్డారు.. అభివృద్ధిలో మాతో పోటీ పడలేని వారే అహంకారం అని ప్రచారం చేశారని దుయ్యబట్టారు బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్.