Site icon NTV Telugu

Pratyusha Suicide : ప్రత్యూష సూసైడ్‌పై ఉపాసన భావోద్వేగం..

Upasana

Upasana

ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ గరిమెళ్ల ప్రత్యూష బంజారాహిల్స్‌లోని తన నివాసంలో శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రత్యూష మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రత్యూష గదిలో కార్బన్‌మోనాక్సైడ్‌ బాటిల్‌ లభ్యం కావడంతో.. ఆమె కార్బన్‌మోనాక్సైడ్‌ వాయువు పీల్చి మృతి చెందినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే కొద్దిసేపటికి క్రితమే పోస్టుమాత్రం పూర్తి కావడంతో ఆమె తల్లిదండ్రుల రిక్వెస్ట్‌ మేరకు మృతదేహాన్ని అపోలోకు తరలించారు. అయితే.. ప్రత్యూష ఆత్మహత్యపై మెగా పవర్‌ స్టార్‌ రాంచ‌ర‌ణ్ తేజ్ స‌తీమ‌ణి ఉపాస‌న భావోద్వేగ‌భ‌రిత ట్వీట్‌ను చేశారు.

ప్ర‌త్యూష‌ను ఉపాస‌న త‌న డియ‌రెస్ట్ ఫ్రెండ్ అంటూ.. ప్ర‌త్యూష చాలా త్వ‌ర‌గానే వెళ్లిపోయింద‌ని, ప్ర‌త్యూష మ‌ర‌ణంతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌య్యాన‌ని ఆ పోస్ట్‌లో ఉపాస‌న ఆవేద‌న వ్య‌క్తపరిచారు. ప్ర‌త్యూష గ‌రిమెళ్ల ప్ర‌తి విష‌యంలోనూ ఉన్న‌తంగానే ఉండేవార‌ని..కెరీర్ ప‌రంగా, కుటుంబం, స్నేహితుల ప‌రంగానూ ఉన్న‌త నిర్ణ‌యాలే తీసుకునేద‌న్న ఉపాస‌న.. అన్ని విష‌యాల్లో ఉన్న‌తంగా ఉన్న ప్ర‌త్యూష డిప్రెష‌న్‌కు గురి కావడం బాధ క‌లిగిస్తోంద‌న్నారు. ప్ర‌త్యూష ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని అంటూ ఆమె ట్వీట్‌ చేశారు.

Exit mobile version