NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy: తెలంగాణలో టీఆర్ఎస్ లేదు.. అది ఎప్పుడో బీజేపీలో కలిసిపోయింది..

Congress Sharna

Congress Sharna

Komatireddy Venkat Reddy: తెలంగాణలో టీఆర్ఎస్ లేదు.. అది ఎప్పుడో బీజేపీలో కలిసిపోయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడి ఆఫీస్ ముందు టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. గన్ పార్క్ నుండి ఈడీ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ ముంన్షి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు, ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం కోమటి రెడ్డి మాట్లాడుతూ.. ఆధాని మెగా కుంభకోణం పై విచారణ జరపాలన్నారు. సెబీ చైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయాలని, సెబీ చైర్మన్ రాజీనామా చేయాలని తెలిపారు. దోషులకు చట్టపరంగా శిక్షించాలనే డిమాండ్లతో ఈ ఆందోళన చేపట్టామన్నారు. మోడీ నల్లధనం తెస్తానని.. పేదల ఖాతాలో పదిహేను లక్షలు వేస్తానని 15 పైసలు కూడా వేయలేదన్నారు.

Read also: Sandra Venkata Veeraiah: కీర్తి వస్తే వాళ్ళది.. అపకీర్తి వస్తే మాదా? సండ్ర సీరియస్‌

అదానీ మాత్రం ప్రపంచంలోనే ధనవంతులు జాబితాలో చేర్చాడు మోడీ అని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడమే లక్ష్యంగా పనిచేద్దాం.. లేదంటే మోడీ ఈ దేశాన్ని నలుగురి చేతిలో పెట్టి నాశనం చేస్తారన్నారు. టీఆర్ఎస్, బీజేపీ ఒకటయ్యాయన్నారు. లేదంటే 14 ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలిచేదన్నారు. తెలంగాణలో టిఆర్ఎస్ లేదన్నారు. అది ఎప్పుడో బీజేపీలో కలిసిపోయిందన్నారు. మన పోరాటం బీజేపీ తోటే అన్నారు. మరోవైపు మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సెబీ చైర్మన్ ని వెంటనే విధుల నుంచి తప్పించాలన్నారు. అదానీ ఆస్తులు అక్రమంగా పెంచడంపై న్యాయవిచారణ జరగాలన్నారు. అదానీ వ్యవహారంపై జేపీసీ తో విచారణ జరిపించాలన్నారు. మోడీని ఎవరు వ్యతిరేకిస్తే వాళ్లపై ఈడి దాడులు జరుగుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కానీ ఆదాని అక్రమాస్తులపై ఎందుకు విచారణ జరగడం లేదన్నారు.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత..