NTV Telugu Site icon

Kishan Reddy: ఆ ఇద్దరు తెలంగాణ రాజకీయాలను భ్రష్టు పట్టించారు.. కిషన్‌ రెడ్డి ఫైర్‌..

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు తెలంగాణ రాజకీయాలను భ్రష్టు పట్టించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ వర్క్ షాప్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 35 లక్షల సభ్యత్వం తెలంగాణలో పూర్తి అయిందన్నారు. ఈ నెల చివరి వరకు పోలింగ్ బూత్ కమిటీలు పూర్తి చేయాలన్నారు. సామరస్యంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పోలింగ్ బూత్ కమిటీ లు వేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 22 న ఢిల్లీలో జరిగే సమావేశంలో మండల, జిల్లా ఎన్నికల తేదీలు ఖరారు అవుతాయని తెలిపారు. వచ్చే నాలుగేళ్లు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో ఉంటూ పోరాడాలన్నారు. బీఆర్ఎస్ లాగానే కాంగ్రెస్ వ్యవహరిస్తుంది.. రెండింటికీ తేడా లేదా? అని ప్రశ్నించారు. అదే అవినీతి, అదే గాలిమాటలు ప్రజలు విసిగిపోతున్నారని అన్నారు. వ్యక్తులను విమర్శించడమే రాజకీయం అనుకుంటే తెలంగాణకు ఇబ్బంది అని సూచించారు. సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు తెలంగాణ రాజకీయాలను భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: Eatala Rajendar: 144 సెక్షన్ పెట్టి అక్కడికి వెళ్లకుండా ఆపుతున్నారు..

ఇంత దిగజారుడు రాజకీయాలను తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేయదన్నారు. జుగుప్స కరంగా, రాజకీయాలంటే అసహ్యించుకునే విధంగా మాట్లాడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ శుద్ద పూస లెక్క మాట్లాడుతుంది…ఏమీ చేశారు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి యే మొఖం పెట్టుకుని వెళ్తున్నారు… సిగ్గుండాలి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో తెలంగాణ కాంగ్రెస్ ఇస్తున్న యాడ్ లని చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాలు అని కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఎవరికీ గులాం ని కాదు… భారతీయులకు గులాంని అన్నారు. ఇటలీ దేశం నుండి వచ్చిన నేతకు మీరు గులాం అన్నారు. తెలంగాణకు విమోచన చేసిన సర్దార్ పటేల్ పుట్టిన గడ్డకు గుజరాత్ కి గులాంనే అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ పుట్టిన గుజరాత్ గడ్డకి నేను గులాంను అన్నారు. ఇప్పటి వరకు రైతుల రుణమాఫీ చేయలేదన్నారు. వంద రోజుల్లో అమలు చేస్తానన్న హామీలు 340 రోజులు అవుతున్న చేయలేదన్నారు. ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు తెలంగాణ ఆర్థిక పరిస్థితి తెలియదా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. పెన్షన్ ఒక రూపాయి పెంచలేదు… ఒక్కరికి కొత్తగా పెన్షన్ ఇవ్వలేదన్నారు.

Read also: V.C. Sajjanar: అర‌చేతిలో వైకుంఠం చూపించ‌డం అంటే ఇదే..!! సజ్జనార్ ట్వీట్ వైరల్..

బీజేపీ, కాంగ్రెస్ ఒకటి అనడానికి బీఆర్ఎస్ నాయకులకు సిగ్గుండాలని తెలిపారు. వాళ్ళు వాళ్ళు ఒకటి… కలిసి మంత్రి వర్గాల్లో పనిచేసారన్నారు. కాంగ్రెస్ మాట్లాడిన, బీఆర్ఎస్ మాట్లాడిన.. బీజేపీ గురించే మాట్లాడుతున్నాయన్నారు. బీజేపీ లేకుండా తెలంగాణ రాజకీయాలు లేవు… భవిష్యత్ బీజేపీ దే అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పై ఆలోచన చెయ్యాలన్నారు. అబద్దాలతో, ఆర్ఆర్ టాక్స్ తో సీఎం రేవంత్ రెడ్డీ సంవత్సరం గడిపారన్నారు. చెట్ల మీద విస్తరులు కుడుతున్నారని తెలిపారు. తెలంగాణ సమాజాన్ని తాకట్టు పెట్టి బీఆర్ఎస్ అప్పు చేసిందన్నారు. నేనేమన్నా తక్కువ తిన్నానా అని అప్పుల కోసమే ఒక టాస్క్ ఫోర్స్ నీ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. కమిషన్ ల కోసం గత ప్రభుత్వం లెక్కనే ఈ ప్రభుత్వం అన్నారు. తెలంగాణ ను కాపాడుకోవాల్సిన బాధ్యత, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పని చేసే పార్టీ బీజేపీ అని తెలిపారు. బీజేపీ కి 36 శాతం, 76 లక్షల ఓట్లు వస్తాయని ఎవరు ఊహించలేదన్నారు. తెలంగాణను మద్యం, అప్పుల, ఏటీఎం రాష్ట్రంగా మార్చి వేశారన్నారు. ఎక్కడ చూసిన కుంభకోణం అని తెలిపారు. కాంట్రాక్టర్ లు వచ్చే పరిస్థితి లేదు… కుటుంబ సభ్యులను పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. కమిషన్ లు ఇచ్చే కాంట్రాక్టర్ లు మాత్రమే తెలంగాణలో ఉన్నారన్నారు. జెన్యూన్ కాంట్రాక్టర్ లు లేరు.. ఇది చాలా ప్రమాదకర పరిస్థితి అన్నారు.
Mulugu: ఆ గ్రామానికి అరిష్టం పట్టింది.. జంగాలపల్లిలో వరుస మరణాల కలకలం..