NTV Telugu Site icon

Danam Nagender: ఓల్డ్ సిటీలో అక్రమ నిర్మాణాలు వారికి కనిపించడం లేదా..?

Danam

Danam

Danam Nagender: హైదరాబాద్ నగరంలోని ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.. పేద ప్రజల జీవన ఆధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారు.. ఎలాంటి పబ్లిక్ నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారు అని ఆరోపించారు. అధికారులు చేసే పనుల వల్ల ప్రజల మధ్య మేము తిరగలేకపోతున్నా.. పేదల ఇండ్లను అధికారులు తొలిగించడం సరైంది కాదు.. ఓల్డ్ సిటీలో అక్రమ నిర్మాణాలు వారికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. మొదలు పెడితే అక్కడి నుండే తొలగింపులు చేయాలి అని ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు.

Read Also: Pakistani Youtuber: “ఇండియా కంటెంట్‌పై మమ్మల్ని కిడ్నాప్ చేశారు”.. బతికే ఉన్న పాక్ యూట్యూబర్లు..

ఇక, అధికారుల వైఖరి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది అని ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మె్ల్యే దానం నాగేందర్ అన్నారు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాడిని.. హైదరాబాద్ ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఉండలేను అని పేర్కొన్నారు. అధికారులు తామే సుప్రీం అనుకుంటున్నారు.. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఆ ప్రభుత్వాలు మనుగడ ఉండదు.. ప్రభుత్వ ఆధీనంలో అధికారులు పని చేయాలి.. హైడ్రా చెరువులను కాపాడటానికి పని చేస్తుంది.. దానిని స్వాగతిస్తున్నాను.. మూసి ప్రక్షాళన చేయాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్ష.. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరికరణ చేసి, పర్యాటక కేంద్రంగా మారుస్తుంది అని దానం నాగేందర్ చెప్పారు.