NTV Telugu Site icon

Khairatabad Ganesh: హుస్సేన్ సాగ‌ర్ నుంచి ఖైరతాబాద్‌ గణపతి అవ‌శేషాల తొల‌గింపు..

Khairatabad Ganesh

Khairatabad Ganesh

Khairatabad Ganesh: హుస్సేన్ సాగ‌ర్ నుంచి అవ‌శేషాల తొల‌గింపులో భాగంగా మ‌హా గ‌ణ‌నాథుడి ఉక్కు మాతృకల‌ను సిబ్బంది బ‌య‌ట‌కు వెలికితీశారు. నిన్న(శుక్రవారం) గ‌ణ‌నాథుడి ఉక్కు మాతృకల‌ను బయటకు తీశారు. ఈ నెల 17న హుస్సేన్ సాగర్ లో ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. 11 రోజుల పాటు లక్షలాది మందిని ఆశీర్వదించిన 70 అడుగుల విఘ్నేశ్వరుడు మంగళవారం పూర్తిగా నిమజ్జనం అయ్యారు. మహా గణపతి శోభాయాత్ర ఈ నెల 17న ఉదయం 6.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం వరకు ముగిసింది. మహాగణపతిని ట్రైలర్‌పైకి ఎక్కించేందుకు హైడ్రాలిక్ క్రూయిజ్ క్రేన్‌ను ఉపయోగించారు. ఈ క్రేన్‌లోని 142 అడుగుల జాక్‌ను 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఎత్తడానికి ఉపయోగించారు. కాగా, మహాగణపతి హుండీ ద్వారా రూ.75 లక్షల ఆదాయం సమకూరినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖైరతాబాద్‌ వినాయకుడి ఉక్కు మాతృకలను తీసే పనులు జరుగుతాయని క్రేన్‌ ఆపరేటర్‌ అన్వర్‌ పేర్కొన్నారు. నిమర్జనం ఐన మూడురోజుల తర్వత ఖైరతాబాద్ బడా గణేష్ ను క్రేన్‌ సహాయంతో బయటకు తీశారు.

అనంతరం హుస్సేన్‌ సాగర్‌లో పేరుకు పోయిన మురికిని బయటకు తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. నిమజ్జనం తరువాత మట్టి, చెత్త, పూలను తొంగించే పనిలో నిమగ్నమయ్యారు. తీసిన చెత్తను డంప్‌ లకు తీసుకుని వెళుతున్నారు.

ఈ కార్యక్రమాన్ని సుమారు 20 మందికి పైగా ఈ ఉక్కును తొలగించేందుకు ఉంటారు. రవి క్రేన్‌ నుంచి ఈ చెత్తను బయటకు తీస్తామని పేర్కొన్నారు. 2007 నుంచి ఈ రవి క్రేన్‌ ద్వారానే వినాయక నిమజ్జనానికి, ఆ తరువాత చెత్తను తీసేందుకు కూడ వాడతారని పేర్కొన్నారు.

Telangana Rains: రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ వర్షాలు..!