Jagga Reddy: బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో కేసీఆర్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రైతు రుణమాఫీపై ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ పూర్తి చేశారు.. కాంగ్రెస్ చేసిన రుణమాఫీకి.. కేసీఆర్ చేసిన రుణమాఫీకి తేడా ఉందన్నారు. ఏడాదిలో 22 వేల కోట్లు మాఫీ చేశారు సీఎం రేవంత్.. పదేళ్లలో కేసీఆర్ చేసిన మాఫీ 20 వేల కోట్లు అన్నారు.. ఏడాదిలో 22 వేల కోట్లు మాఫీ చేయడం గొప్పనా? అని ప్రశ్నించారు. పదకొండు ఏండ్లలో 20 వేల కోట్లు ఇవ్వడం గొప్ప నో చెప్పాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లు సమయం ఉన్నా.. సీఎం రేవంత్ మీలా సాగదీయలేదన్నారు. ఈ రెండింటి మధ్య తేడాను తెలంగాణ రైతులు గమనించాలని జగ్గారెడ్డి సూచించారు.
Read Also: Big Alert: నిఘా వర్గాల హెచ్చరిక.. కాశ్మీర్‌లో 48 పర్యాటక ప్రాంతాలు మూసివేత
ఇక, సన్న వడ్లకి క్వింటకు రూ. 500 బోనస్ పై రైతులు సంతోషంగా ఉన్నారని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఐదు ఎకరాల్లో సాగు చేస్తే..75 వేలు బోనస్ వస్తుంది.. రైతులను తప్పుదోవ పట్టించేలా కేసీఆర్ మాట్లాడుతున్నారు.. సన్నబియ్యంతో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ లను శభాష్ అంటున్నారు ప్రజలు.. గొప్పలు చెప్పడం లేదు.. ఇది వాస్తవం అన్నారు. ఇక, ఆర్టీసీ బస్సుల్లో మహిళలు కోట్లాడుతున్నారని కేసీఆర్ అంటున్నారు.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం తప్పా అని అడిగారు. సీటు దొరకని వాళ్ళు తిట్టుకుండొచ్చు.. సీట్లో కూర్చున్న మహిళలు మెచ్చుకుంటారు కదా.. గతంలో కేసీఆర్ ఆర్టీసీని కనుమరుగు చేశాడని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
అయితే, కేసీఆర్ విమర్శిస్తున్నారంటే ఉచిత బస్సు సక్సెస్ అయినట్టే.. ఆయనకు నష్టం కలుగుతుంది కాబట్టి ఆర్టీసీ ఉచిత ప్రయాణం వెస్ట్ అనే అంటాడని జగ్గారెడ్డి పేర్కొన్నారు. మా దగ్గర నుంచి మహిళ రైతులు గుడిమల్కాపురం వరకు వస్తున్నారు.. ఏడాదికి 4 వేల కోట్లు మహిళలకు ఇస్తున్నాం.. తప్పా.. ఉచిత బస్సు తీసేయండి అంటున్నారా..? కేసీఆర్ క్లారిటీ ఇవ్వండి.. బీఆర్ఎస్ సభ జరగడానికి మేము ఇచ్చిన స్వేచ్ఛనే కారణం.. మీ హయంలో మమల్ని అరెస్టులు.. ఆపే వాళ్ళు అని మండిపడ్డారు. మా పోలీసులు మీరు రోడ్ల మీద డాన్సులు చేసుకుంటూ సభలకు పోయినా.. ఏం అనలేదు.. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలి.. మంచిగా ఉండాలి.. ఎప్పుడూ ప్రతిపక్షంలోనే ఉండాలి అని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు.
