KCR: ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్..
- నందినగర్ నివాసం నుంచి అసెంబ్లీకి కేసీఆర్..
- ప్రతిపక్ష నేతగా మొదటిసారి సభలో అడుగు పెట్టనున్న కేసీఆర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR: శాసనసభ సమావేశాలు మూడో రోజు కొనసాగనున్నాయి. దీంతో ఇవాళ అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఇవాళ నందినగర్ నివాసం నుంచి అసెంబ్లీకి కేసీఆర్ బయలుదేరారు. ప్రతిపక్ష నేతగా మొదటిసారి సభలో అడుగు పెట్టనున్నారు. కేసీఆర్ వెంట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు అసెంబ్లీకి రానున్నారు. భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రతిపక్ష నేతగా దాదాపు ఏడు నెలల తర్వాత తొలిసారిగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఆశక్తికరంగా మారింది. అసలు అధికార పార్టీని కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారనే చర్చ ప్రస్తుతం సాగుతోంది. బడ్జెట్ సమావేశాల రోజు కేసీఆర్ హాజరు కానున్నడంతో మాజీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారో, మైక్ ఇస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. పదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్న ఆయన అసలు సభలో ఉంటారో లేదో తెలియాలంటే మరి కొద్ది నిమిషాలు ఆగాల్సిందే.
Read also: Anasuya Bharadwaj: మీకు అది చేతకాదు.. దుమారం రేపుతున్న అనసూయ ట్వీట్!
Also Read
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ తొలిసారి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన పరిణామాలు బీఆర్‌ఎస్‌ను చతికిలపడేలా చేశాయనే చెప్పాలి. అనారోగ్యం కారణంగా గత రెండు సమావేశాల్లో పార్టీ అధినేత కేసీఆర్ హాజరు కాలేదు. విడివిడిగా ప్రమాణం కూడా చేశారు. ఈ అధికార పార్టీకి ఆయుధం కావాలంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి స్పీచ్ ఇవ్వాల్సిందేనని విమర్శించేవారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు కేసీఆర్ శాసనసభ సమావేశాలకు రాకపోవడంపై పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఇటీవల బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రెండు రోజులు కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాలేదు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై శాసనసభలో జరిగిన చర్చలో సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. అయితే ముందుగా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు వస్తామని ప్రకటన విడుదల చేశారు. బడ్జెట్ పై నేడు శాసనసభ సమావేశానికి మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.
Jurala Project: జూరాల ప్రాజెక్టు 42 గేట్లు ఎత్తివేత.. హెచ్చరికలు జారీ..
తాజావార్తలు
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్‌ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Sunrisers: బోణి కొట్టిన సన్ రైజర్స్.. ఎమ్ఐ లండన్‌పై ఘన విజయం..
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!