Site icon NTV Telugu

Lakshma Reddy: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత.. కేసీఆర్ సంతాపం

Kcr

Kcr

Lakshma Reddy: మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే చెర్లకోళ్ల లక్ష్మారెడ్డి భార్య శ్వేతా లక్ష్మారెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. కాగా.. మాజీ మంత్రి, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా లక్ష్మారెడ్డి మృతిపట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి మరణం తీవ్రంగా బాధించిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. వారి కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read also: Bhadrachalam Godavari: భద్రాచలం వద్ద మరోసారి విజృంభిస్తున్న గోదావరి..

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతారెడ్డి మరణం బాధాకరమని హరీష్ రావు అన్నారు. కష్టకాలంలో లక్ష్మారెడ్డికి భగవంతుడు ధైర్యాన్ని అందించాలని, వారికి..వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని తెలిపారు. శ్వేతారెడ్డి మృతితో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలుపుతూ శ్వేత లక్ష్మారెడ్డితో తమకున్న అనుబంధాన్ని చాటుకుంటున్నారు. శ్వేతారెడ్డి భౌతికకాయాన్ని మంగళవారం ఉదయం 6 గంటలకు చెన్నై నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకొచ్చి అక్కడి నుంచి నేరుగా జడ్చర్ల మీదుగా స్వగ్రామం ఆవంచకు తీసుకుని వచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అవంచ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, అంత్యక్రియలకు బీఆర్ఎస్ అగ్రనేతలు, హరీశ్ రావు కేటీఆర్ హాజరు అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Loan App Harassment: లోన్‌ యాప్‌ వేధింపులకు వ్యక్తి మృతి.. అశ్లీల వీడియోలుతో..

Exit mobile version