NTV Telugu Site icon

Kaushik Reddy: నాకు 39, నీకు 70 ఏండ్లు.. నేను రెచ్చిపోతే ఎట్లా ఉంటదో చూసుకో..

Koushik Reddy

Koushik Reddy

Kaushik Reddy: నేను 39 ఏళ్ల యువకుడిని.. గాంధీకి 70 ఏళ్ల ముసలోనివి నువ్వు.. నేను రెచ్చిపోతే ఎట్లా ఉంటదో చూసుకో అని అరికెపూడి గాంధీకి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఉదయం 5 నుంచే నన్ను ప్రివెంటివ్ అరెస్ట్ చేశారని తెలిపారు. గాంధీకి సూటిగా అడుగుతున్న.. BRS లోనే ఉన్నానని అంటున్నారు కదా.. నేను మీ పార్టీ సహచర ఎమ్మెల్యేను నేను మీ ఇంటికి వస్తే భయమేంటి అని ప్రశ్నించారు. ఇద్దరం కలిసి BRS కండువా వేసుకుని తెలంగాణ భవన్ తో ప్రెస్ మీట్ పెడుదాం అన్నారు. పార్టీ మారనప్పుడు జెండా వేసుకుంటే తప్పేంటి.! అని ప్రశ్నించారు. రేవంత్ ను కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్టీలో చేరానని చెప్పావన్నారు. చంద్రబాబును మోసం చేశాం.. కేసీఆర్ ను మోసం చేసావు.. ఈరోజు కాంగ్రెస్ లో చేరావన్నావు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను 39 ఏళ్ల యువకుడిని.. 70 ఏళ్ల ముసలోనివి నువ్వు.. నేను రెచ్చిపోతే ఎట్లా ఉంటదో చూసుకో అని మండిపడ్డారు. కేసీఆర్ ను వ్యతిరేకించిన ఈటెల రాజేందర్ ను హుజూరాబాద్ లో బొందపెట్టిన్నారని గుర్తుచేశారు.

Read also: Edupayala Temple: మరోసారి మూతపడ్డ ఏడు పాయల ఆలయం

నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డను.. ఎడ నుంచో వచ్చి నాకు సవాల్ విసురుతున్నావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు మేడ్చల్ BRS పార్టీ ఆఫీస్ నుంచి కార్యకర్తలతో కలిసి గాంధీ ఇంటికి పోదామన్నారు. రేపు పదకొండు గంటలకి మేడ్చల్ పార్టీ ఆఫీస్ నుంచి గాంధీ దగ్గరికి వెళ్తామన్నారు. శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో గాంధీ ఇంటికి కార్యకర్తలతో వెళ్తామన్నారు. BRS బీ ఫామ్ పైన గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లడం సిగ్గు అనిపించడం లేదా? అని సంచలన వ్యాఖ్యలు చేశారు. భూ పంచాయితీలను సెటిల్ చేసుకోవడానికి గాంధీ పార్టీ మారాడని కీలక వ్యాఖ్యలు చేశారు. నీకు దమ్ముంటే రాజీమానా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు. BRSలో ఉంటే తెలంగాణ భవన్ కు రా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేవి అయితే రాజీనామా చేయ్ అన్నారు. గాంధీ ఇప్పుడు నా ఇంటికి వస్తే మోస్ట్ వెల్కమ్ అన్నారు. భోజనం చేసి తెలంగాణ భవన్ కు వెళ్లి ఇద్దరం ప్రెస్ మీట్ పెడుతాం అన్నారు. కేసీఆర్ దగ్గరికి కలిసి వెళ్తాం అన్నారు. మైనంపల్లి హనుమంతరావు కూడా గతంలో కేటీఆర్ ను నోటికి వచ్చింది తిట్టాడు.. చిత్తుగా ఓడిపోయాడు.. నెక్స్ట్ గాంధీనే.. అని సంచలన వ్యాఖ్యలు చేశారు. చీరలు గాజుల సంస్కారం రేవంత్ రెడ్డి నేర్పించిందే అన్నారు.

Rajanna Sircilla: బాత్రూంలో ఉండగా వీడియో తీసిన పీఈటీ.. రోడెక్కిన విద్యార్థినిలు

Show comments