Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్ విచారణ నేటి నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. నేడు (సోమవారం) జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ 14 మంది ఇంజనీర్లను ప్రశ్నించనుంది. విచారణలో భాగంగా డీఈలు, ఏఈలు కమిషన్ ఎదుట హాజరుకానున్నారు. రేపు (మంగళవారం) మరో 14 మంది ఇంజినీర్లను కమిషన్ ప్రశ్నించనుంది. ఈసారి ఘోష్ కమిషన్ మొత్తం 52 మంది ఇంజనీర్లను ప్రశ్నించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల పత్రాలు ఇప్పటికే కమిషన్‌కు చేరాయి. ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారుల తర్వాత ప్రశ్నిస్తారు. వారి తరువాత, కాంట్రాక్టర్లను పిలిచి అనేక ప్రశ్నలు అడుగుతారు. కాళేశ్వరం కమిషన్ అకౌంట్స్ విభాగం అధికారులను కూడా ప్రశ్నించనుంది. ప్రాజెక్టు నిధుల సేకరణ, బదిలీ అంశంపై కమిషన్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మేరకు పలు ప్రశ్నలు వేయనున్నారు.
Read also: Adilabad: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాను వణికిస్తున్న చలి.. సింగిల్ డిజిట్ కు కనిష్ఠ ఉష్ణోగ్రతలు
పీసీ ఘోష్ కమిషన్ బీఆర్‌ఎస్ ప్రభుత్వ అధికారులను కూడా బహిరంగ విచారణకు పిలిచే అవకాశం ఉంది. మాజీ మంత్రులను కూడా విచారించే యోచనలో కమిషన్ చైర్మన్ ఘోష్ ఉన్నట్లు తెలుస్తోంది. మూడు కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన కీలక అంశాలను ఇప్పటికే జస్టిస్ చంద్రఘోష్ సేకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల నిర్మాణంపై విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న వారితో పాటు ఆయా నిర్ణయాల్లో భాగస్వాములైన మాజీ ప్రజాప్రతినిధులను కూడా విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచారణ తుది దశకు చేరుకుంది. అందరినీ విచారించిన అనంతరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఈ ఏడాది డిసెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.
Karthika Somavaaram: కార్తీక చివరి సోమవారం.. శివ నామస్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు..