పార్టీ మారినట్లుగా వస్తున్న వార్తలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఖండించారు. పార్టీ ఫిరాయింపుపై స్పీకర్ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు లిఖితపూర్వంగా వివరణ ఇచ్చారు. ‘‘నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు.. నేను పార్టీ మారానంటూ చేస్తున్న ప్రచారం తప్పు.. నేను బీఆర్ఎస్ సభ్యత్వం రద్దు చేసుకోలేదు.. కాంగ్రెస్ పార్టీలో చేరుతానని నేను ఎక్కడా చెప్పలేదు.. స్పీకర్‌కు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చాను.’’ అని కడియం శ్రీహరి తెలిపారు.
ఇది కూాడా చదవండి: Himachal Pradesh Video: లోతైన లోయలో పడిపోబోయిన వ్యాన్.. తర్వాత ఏమైందంటే..!
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో బుధవారం తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పు వెలువరించారు. ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లను స్పీకర్ కొట్టివేశారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు ఆరోపణలను తోసిపుచ్చారు. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్‌లపై అనర్హత వేటు వేయడానికి నిరాకరించారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు ఎక్కడా ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని, సాంకేతికంగా ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోనే ఉన్నట్టు స్పష్టం చేశారు.
ఇది కూాడా చదవండి: Harish Rao: రాజ్యాంగంపై ఢిల్లీలో ఉపన్యాసాలు.. తెలంగాణలో ఇంకొక వైఖరా?
బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించినట్లు 10 మంది ఎమ్మెల్యేలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. డిసెంబర్ 18లోగా నిర్ణయాన్ని తమకు సీల్డ్ కవర్‌లో సమర్పించాలని సుప్రీంకోర్టు గత విచారణ సందర్భంగా తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ గత నెల రోజులుగా ఎమ్మెల్యేల విచారణను వేగవంతం చేశారు. 8 మందికి సంబంధించి విచారణను స్పీకర్ పూర్తి చేశారు.
