NTV Telugu Site icon

Jagga Reddy: సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక కోస్తా..

Jagga Reddy

Jagga Reddy

Jagga Reddy: మా సీఎం రేవంత్ రెడ్డిని.. పనికి రాని వాడు అంటే.. కేటీఆర్ కానీ, వాళ్ళ అయ్య (కేసీఆర్) కానీ ఎవరన్నా సరే నాలుక కోస్తం అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మా పార్టీ కార్యకర్తలను రెచ్చ కొట్టకండి అన్నారు. కాంగ్రెస్ ఎంఎల్ఏ లు ఇంత చిల్లర చేయరని అన్నారు. అనవసర రచ్చ బీఆర్ఎస్ చేస్తుందన్నారు. హైదరాబాద్ ప్రజల మూడు ఖరాబ్ చేశారన్నారు. వినాయకుడి పూజలు చూడకుండా చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఖైరతబాద్ వినాయకుడి నీ చూపించేవి టీవీలు.. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లు లొల్లి పెట్టీ ఖైరతాబాద్ వినాయకుణ్ణి ప్రజలు చూడకుండా చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వినాయకుడి సేవలో పోలీసులు ఉన్నారన్నారు. హరీష్ రావు నీకు బుర్ర పని చేయడం లేదా? అని మండిపడ్డారు. రోడ్డుమీదకు కేసీఆర్ ఫ్యామిలీ వచ్చింది.
పోలీసులు.. పెండ్లాం, పిల్లల వదిలేసి మండపాల్లో ఉన్నారు.

Read also: Ponnam Prabhakar: ఆంధ్రోళ్ల పై కౌశిక్‌ రెడ్డి మాట్లాడిన వీడియోను కేటీఆర్ కు పంపుతా..

ఆంధ్ర ఎంఎల్ఏ లను పార్టీలోకి తీసుకున్నది మీరే.. చేపల పులుసు తిన్నది మీరే.. ఆంధ్రోళ్ల కి టికెట్ ఇచ్చింది మీరే.. పవర్ పోయే సరికి నిద్ర పట్టడం లేదు వాళ్లకు.. కళ్ళు తాగిన కోతి లెక్క ఉంది బీఆర్ఎస్ ఎమ్మెల్యల పద్ధతి అంటూ మండిపడ్డారు. నేను వైఎస్ హయం లో కాంగ్రెస్ కండువా కప్పుకోలేదన్నారు. ఎమ్మెల్యేలకు డైరెక్ట్ కండువా కప్పిన సంస్కృతి లేదు ఉమ్మడి రాష్ట్రంలో అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత నే మొదలైంది కండువాలు కప్పుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 నుండి 2018 వరకు ఎంపీ లు నలుగురు.. 25 ఎంఎల్ఏ ..18 మంది mlc లను పార్టీలో చేర్చుకుంది కేసీఆర్ అన్నారు. ఫిరాయింపులకు ఆజ్యం పోసిందే కేసీఆర్ కదా..? అని ప్రశ్నించారు. సిఎల్పీ ల విలీనం కూడా కేసిఆరే తెచ్చాడన్నారు. కాంగ్రెస్ ఎంఎల్ఏ లను కలుపుకుని విలీనం చేసింది నువ్వే కదా? మీ మామ.. మీ నాన్న తెచ్చిన పాలసినే కదా..? ముందు మీ మామ..మీ నాన్న నీ అడగండి ముందు..నువ్వు తప్పు చేశావు అని అడగండి.. కేసీఆర్ సిఎం అయ్యాకా..రాజకీయాల్లో ఎథిక్స్ పోయాయన్నారు. మీ రాజకీయం నువ్వు.. మా రాజకీయం మేము చేస్తున్నాం.. కేసీఆర్ .. కాంగ్రెస్ నీ వెన్నుపోటు పొడిచారన్నారు.

Read also: KTR: హైదరాబాద్‌లో ఉన్న ప్రజలందరూ మా వారే.. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్..

బీజేపీ డైరెక్షన్ లో… కాంగ్రెస్ కి వెన్నుపోటు పొడిచారు కేసీఆర్ అని మండిపడ్డారు. నీతి మాలిన.. నియమాలు లేని పాలన చేశారు కేసీఆర్ అన్నారు. కేటీఆర్ పరిపాలన చేసింది తెలంగాణ లో.. భాష మాత్రం ఆంధ్ర భాష మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ తాతలు విజయనగరం నుండి వలస వచ్చారని కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే కేటీఆర్ కి ఆంధ్ర భాష వచ్చింది.. హరీష్ రావు నీ ఎలుగు బంటి కరిచినట్టు ఉంది.. రెండు రోజులుగా ఆయన దుంకుడు చూస్తుంటే ఎలుగు బంటి కరిచింది అనిపిస్తున్నదన్నారు. లేకపోతే ఎలుగు బంటి నీ బీఆర్ఎస్ వాళ్ళు కరిచ్చినట్టు ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డి కి… ఉత్తమ్ కి ఏం సంబంధం ? బీజేపీ .. సందుల్లో దూరాలి అని.. వచ్చిందన్నారు. రాజకీయం చేయడం తప్పితే బీజేపీ ఏం తెలుసు అన్నారు. కౌశిక్ పంచాయతీ విషయంలో రేవంత్ …ఉత్తమ్ కి క్లారిటీ ఉందన్నారు. రెండు రోజులు టీవీలో ఎంటర్టైన్మెంట్ ఇచ్చారన్నారు. రాజకీయంగా ప్రత్యర్థి నన్ను కత్తితో పొడవటానికి వస్తె.. నేను ఊరుకోనన్నారు. తిరిగి ఎదురు దాడి చేస్తాం..అదే రాజనీతి అన్నారు. కేసీఆర్..రేవంత్ నీ పొడవడానికి వస్తె..చూస్తూ ఊరుకుంటారా రేవంత్.. ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రేవంత్ సర్కార్ దే అన్నారు.
Cabinet Meeting: ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ సమావేశం.. హైడ్రాపై చర్చ..

Show comments