Jagga Reddy: సీఎం రేవంత్ నీ కేసీఆర్ అపాయింట్ మెంట్ అడుగు.. ఇవ్వడా.. సచివాలయం వెళ్లి సమస్యలపై చర్చ చెయ్ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రకటన చేస్తే.. వాటికి ఎప్పుడైనా విలువ ఉందా? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ తన రాజకీయ జీవితంలో ఎప్పుడైనా మాటకు కట్టుబడి ఉన్నారా..? అని మండిపడ్డారు. చెప్పిన మాటకు కట్టుబడి ఉంటే.. మాకెందుకు అధికారం ఇస్తారు ప్రజలు అని తెలిపారు. సీఎం రేవంత్… కేసీఆర్ నీ అసెంబ్లీ కి రండి.. మాకు సలహాలు సూచనలు ఇవ్వండి అని అడిగారు.. అయినా రాలేదన్నారు. తెలంగాణలో రివర్స్ పాలిటిక్స్ నడుస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ పెడితే… ప్రతిపక్ష నాయకుడు వస్తారు.. సీఎంలు సరిగా రారన్నారు. కానీ తెలంగాణలో సీఎం రేవంత్… ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ నీ సభకు రండి అని పిలిచే పరిస్థితి వచ్చిందన్నారు. బయట మాట్లాడే కేసీఆర్.. సభలోకి వచ్చి రుణమాఫీ గురించి మాట్లాడొచ్చు కదా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ పెట్టండి సమస్యలపై మాట్లాడాలి అని ప్రతిపక్ష నాయకుడు అడగాలి.. కానీ సీఎం అసెంబ్లీ పెట్టీ ప్రతిపక్ష నాయకుడి నీ సభకు రండి అని పిలిచే పరిస్థితి వచ్చిందన్నారు.
Read also: CM Revanth Reddy: సచివాలయంలో సీఎం రేవంత్ కు వేములవాడ అర్చకుల ఆశీర్వాదం..
సీఎం గా సచివాలయం రాలేదు..ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీ కి కూడా రావడం లేదన్నారు. రేవంత్ నీ కేసీఆర్ అపాయింట్ మెంట్ అడుగు.. ఇవ్వడా.. సచివాలయం వెళ్లి సమస్యలపై చర్చ చెయ్ అన్నారు. సీఎం అందుబాటులో లేరా? అని ప్రశ్నించారు. మీ హయంలో ప్రతిపక్ష నాయకులకు అపాయింట్ మెంట్ ఇవ్వలేని పరిస్థితి.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. రుణమాఫీ మేము ఇచ్చిన మాట ప్రకారం 9 నెలల్లో చేశామన్నారు. రుణమాఫీ కోసం 12 వేల కోట్లు నిధులు రెడీగా ఉన్నాయన్నారు. సమస్య 2 లక్షల రుణాల విషయంలోనే.. కేసీఆర్ తొమ్మిదిన్నర యేండ్లలో సిస్టం అంతా ఖరాభ్ చేశారని కీలక వ్యాక్యలు చేశారు. ప్రభుత్వానికి.. బ్యాంకర్లకు మధ్య ఆన్లైన్ సిస్టం దెబ్బ తీశారు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. అందుకే ఆలస్యం అవుతుందని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారుల విధానం కూడా దెబ్బతిశారు కేసీఆర్ అన్నారు. ఇంటింటి సర్వే చేస్తున్నది సర్కార్..సెప్టెంబర్ నెలాఖరు వరకు అందరికీ మాఫీ ఐపోతుందన్నారు. హరీష్ రావు అధికారం మజా లో ఉన్నాడన్నారు. హరీష్ కి లెక్కలే రావు.. ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడన్నారు. మేన మామ చెప్పింది చేయడమే హరీష్ రావు పని అన్నారు. రాహుల్ గాంధీ వరంగల్ వస్తారు..అసలు సంబరాలు అక్కడ చేస్తామన్నారు.
Harish Rao: ముఖ్యమంత్రి సారుకు ఇవేవీ పట్టవు.. హరీష్ రావ్ ట్వీట్ వైరల్..