Jagadish Reddy: బీఆర్ఎస్ రాగానే సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి తీరుతామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ దొంగలా దొరికిపోయిందని తెలిపారు. ఇంకా 13 లక్షల మందికి రుణమాఫీ చేయాల్సి ఉందని మంత్రులు ఒప్పుకున్నారన్నారు. బ్యాంకర్ల లెక్క ప్రకారం 50 లక్షల మంది రైతులు 49 వేల కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వం చెప్పిన 31 వేల కోట్ల రూపాయల రుణమాఫీని ఎప్పుడు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. రుణమాఫీ అయిందని సీఎం డ్యాన్సులు వేస్తున్నారన్నారు. రాజీనామా ఎవరు చేయాలో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. రైతు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్నారు. రైతులకు, బ్యాంకు అధికారులు, వ్యవసాయ అధికారుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయన్నారు. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఇంకా పని మొదలు పెట్టలేదని తెలిపారు. ప్రభుత్వంలో మంత్రుల మాటలకు పొంతన లేదన్నారు.
Read also: Revanth Reddy Strong Counter: విగ్రహంపై చేయి వేసి చూడు.. కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్..
ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామన్నారు. బీఆర్ఎస్ రాగానే సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి తీరుతామన్నారు. సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మూడవ సారి అధికారంలోకి వస్తే పెడదామని అనుకున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణ ద్రోహులు పరిపాలన చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏం సంభందం? రాజీవ్ గాంధీకి తెలంగాణ పేరు తెలుసా? తెలంగాణ ఒక్క రూపాయి మేలు రాజీవ్ గాంధీ చేశాడా? అని ప్రశ్నించారు. చిల్లర చేష్టలు తెలంగాణ ప్రజలు కోరుకోవడం లేదన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిన చోట తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే నిర్ణయం జరిగిందన్నారు. రాజీవ్ గాంధీ నోటి నుండి ఎప్పుడైనా తెలంగాణ పదం వినిపించిందా? అని ప్రశ్నించారు. సీఎం నోటి నుండి కాంగ్రెస్ నాయకులను తిట్టే మాటలను త్వరలోనే వింటామన్నారు.
Motkupalli Narasimhulu: ఎవరో ఏదో అన్నారని.. వెనక్కి తగ్గకండి రేవంత్ రెడ్డి..