Site icon NTV Telugu

Iran-Israel conflict: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత.. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్ ఏర్పాటు

Bhavan

Bhavan

Iran-Israel conflict: ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో.. ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న లేదా ప్రయాణిస్తున్న తెలంగాణ వాసులు, విద్యార్థులకు సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. దీనికి విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు రెండు దేశాల భారత రాయబార కార్యాలయాల నుంచి లభించిన తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం, తెలంగాణకు చెందిన ఎవరూ ప్రభావితమైనట్టు సమాచారం లేదు అన్నారు. అయినప్పటికీ, భవిష్యత్ పరిణామాల దృష్ట్యా ముందు జాగ్రత్తగా చర్యగా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయడమైంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదిస్తున్నారు. అవసరమైతే తక్షణ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

Read Also: Caarthick Raju : బడా హీరోతో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ సెట్ చేసిన #Single డైరెక్టర్?

* సహాయం కోసం ప్రజలు ఈ క్రింది నెంబర్లకు సంప్రదించవచ్చు:

1. వందన, పీఎస్, రెసిడెంట్ కమిషనర్– +91 9871999044.
2. జి. రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్– +91 9643723157.
3. జావేద్ హుస్సేన్, లైజన్ ఆఫీసర్– +91 9910014749.
4. సీహెచ్. చక్రవర్తి, పౌర సంబంధాల అధికారి– +91 9949351270.

Exit mobile version