Hyderabad: గచ్చిబౌలి లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. ఫ్రిడ్జ్ లో పాడైన కూరగాయలు
- గచ్చిబౌలి లోని ఓవర్ ది మూన్ పబ్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు..
- కాలం చెల్లిన వస్తువులతో పాటు అపరిశుభ్రంగా ఉన్న కిచెన్..
- బొద్దింకలతో పాటు పాడైన కూరగాయలు నిల్వ ఉంచిన ది మూన్ పబ్ యజమాన్యం..
- ఎటువంటి గుర్తింపు లేని ఏడు ప్యాకెట్ ల సాస్ గుర్తించిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా ఆహార భద్రత అధికారులు తనిఖీలు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఈ తనిఖీల్లో పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహారం పాడవడంతో పాటు, కుళ్లిపోయిన మాంసం, వంటగదిలో అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో నిబంధనలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. బయట తినేందుకు జనం భయాందోళన చెందుతున్నారు. ఇక తాజాగా.. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి లోని ఓవర్ ది మూన్ పబ్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేపట్టారు. కిచెన్ లో కాలం చెల్లిన వస్తువులతో పాటు, అపరిశుభ్రంగా ఉండటంతో అధికారులు మండిపడ్డారు.
ఫ్రిడ్జ్ లో ఎటువంటి లేబుల్స్ లేకుండా నిల్వ ఉంచిన పదార్థాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. బొద్దింకలతో పాటు పాడైన కూరగాయలు నిల్వ ఉంచడంతో మూన్ పబ్ యజమాన్యంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రశ్నించారు. ఎటువంటి గుర్తింపు లేని ఏడు ప్యాకెట్ ల సాస్ అను అధికారులు గుర్తించారు. మెడికల్ సర్టిఫికెట్ లేకుండ మెయింటైన్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మూన్ పబ్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా.. ఇటీవల హైదరాబాద్లోని పలు ఆహార కేంద్రాలపై తెలంగాణ ఆహార భద్రత శాఖ తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే. గడువు ముగిసిన ఆహారం, తెగుళ్లు, లైసెన్స్లు/రికార్డులు లేకపోవడం, అపరిశుభ్ర పరిస్థితులు టాస్క్ఫోర్స్ గుర్తించిన విషయం తెలిసిందే.
ED Raids On AAP MP House: ఆప్ ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు.. మండిపడిన మనీష్ సిసోడియా..
Also Read
- Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
తాజావార్తలు
-
Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
-
Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
-
Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
-
Most Valuable Celebrities List : మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటి లిస్ట్ విడుదల.. టాప్ ప్లేస్లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ర్యాంక్ ఎంత?
-
Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!