NTV Telugu Site icon

Hyderabad: గచ్చిబౌలి లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. ఫ్రిడ్జ్ లో పాడైన కూరగాయలు

Gachhibowli

Gachhibowli

Hyderabad: ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా ఆహార భద్రత అధికారులు తనిఖీలు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఈ తనిఖీల్లో పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహారం పాడవడంతో పాటు, కుళ్లిపోయిన మాంసం, వంటగదిలో అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో నిబంధనలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. బయట తినేందుకు జనం భయాందోళన చెందుతున్నారు. ఇక తాజాగా.. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి లోని ఓవర్ ది మూన్ పబ్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేపట్టారు. కిచెన్ లో కాలం చెల్లిన వస్తువులతో పాటు, అపరిశుభ్రంగా ఉండటంతో అధికారులు మండిపడ్డారు.

ఫ్రిడ్జ్ లో ఎటువంటి లేబుల్స్ లేకుండా నిల్వ ఉంచిన పదార్థాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. బొద్దింకలతో పాటు పాడైన కూరగాయలు నిల్వ ఉంచడంతో మూన్ పబ్ యజమాన్యంపై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ప్రశ్నించారు. ఎటువంటి గుర్తింపు లేని ఏడు ప్యాకెట్ ల సాస్ అను అధికారులు గుర్తించారు. మెడికల్ సర్టిఫికెట్ లేకుండ మెయింటైన్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మూన్ పబ్ పై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా.. ఇటీవల హైదరాబాద్‌లోని పలు ఆహార కేంద్రాలపై తెలంగాణ ఆహార భద్రత శాఖ తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే. గడువు ముగిసిన ఆహారం, తెగుళ్లు, లైసెన్స్‌లు/రికార్డులు లేకపోవడం, అపరిశుభ్ర పరిస్థితులు టాస్క్‌ఫోర్స్ గుర్తించిన విషయం తెలిసిందే.
ED Raids On AAP MP House: ఆప్ ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు.. మండిపడిన మనీష్ సిసోడియా..