Site icon NTV Telugu

Kishan Reddy: భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో తెలంగాణకు మేలు..

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: భారత్-బ్రిటన్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్యానికి సంబంధించి చారిత్రాత్మక ఒప్పందంగా నిలిచిపోతుంది అన్నారు. ప్రధాని మోడీ ఈ విషయాన్ని మంగళవారం అధికారికంగా ప్రకటించారు.. ఈ ఒప్పందం ఆత్మ నిర్భర భారత్ లక్ష్యాలను నెరవేర్చడంలో కీలకంగా మారనుంది.. ఈ ఒప్పందంతో దేశంలోని వస్త్ర పరిశ్రమ, సముద్ర ఉత్పత్తులు, లెదర్ ఉత్పత్తులు, ఫుట్‌వేర్ రంగం, రాళ్లు, ఆభరణాల రంగం, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఆర్గానిక్ రంగాలకు లబ్ధి చేకూరుతుంది అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Normal Delivery: నార్మల్ డెలివరీ కావాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి!

అయితే, భారతదేశం నుంచి బ్రిటన్ దిగుమతి చేసుకునే దాదాపు 99 శాతం ఉత్పత్తులపై ఎలాంటి సుంకం ఉండదు అని కిషన్ రెడ్డి తెలిపారు. దీంతో మన దేశం నుంచి భారీగా ఎగుమతులు చేసుకునే అవకాశం ఉంటుంది.. దీని వల్ల ఉద్యోగ అవకాశాలు పెరడగంతో పాటు దేశ ఆర్థికవృద్ధికి ఈ ఒప్పందం ఊతమిస్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఒప్పదంతో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన లబ్ధి జరగనుందన్నారు. మన రాష్ట్రంలోని చేనేత వస్త్రాలను బ్రిటన్‌‌కు ఎగుమతి చేసేందుకు మార్గం సుగమం కానుంది అన్నారు. మన నేతలన్నకు లబ్ధి చేకూరనుంది.. హైదరాబాద్ ఇప్పటికే ఐటీ సేవల్లో ప్రపంచ గుర్తింపును పొందిన నేపథ్యంలో తాజా ఒప్పందంతో మన ఐటీ సర్వీసులకు మరింత లబ్ధిచేకూరనుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

Read Also: PM Modi: ‘‘ఇకపై మన నీరు మన కోసమే ప్రవహిస్తుంది, మన కోసమే ఆగిపోతుంది’’.. పాక్‌కి మోడీ బిగ్ మెసేజ్..

ఇక, బ్రిటన్‌కు ఎగుమతులు పెరగడంతో వికసిత భారత్ లక్ష్యాన్ని అందుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుందని విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. అయితే, 2024లో బ్రెజిల్‌లోని రియో డీ జెనీరోలో జరిగిన జీ-20 సదస్సు సందర్భంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఇరు దేశాల మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది అన్నారు. చివరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చొరవతో ఈ ఒప్పందం కార్యరూపుం దాల్చింది.. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు దేశాన్ని పరుగులు పెట్టించేందుకు మోడీ చేస్తున్న కృషి చేస్తున్నారు. ఇటీవలే, జపాన్‌ను వెనక్కు నెట్టి ప్రపంచంలో నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిన సంగతి తెలిసిందేనన్నారు. 2030 నాటికి 7 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారతదేశం దూసుకెళ్తుందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Exit mobile version