Site icon NTV Telugu

Smita Sabharwal: గచ్చిబౌలి పోలీసుల నోటీసులకి ఐఏఎస్ స్మితా సబర్వాల్ రియాక్షన్..

Smitha

Smitha

Smita Sabharwal: కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై 400 ఎకరాల అడవి ధ్వంసానికి సంబంధించిన ఓ ఏఐ రూపొందించిన ఫోటోను తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోతో ఆమె చిక్కుల్లో పడింది. అయితే, సదరు సీనియర్ ఐఏఎస్ అధికారిణికి బీఎన్ఎస్ 179 సెక్షన్ కింద గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Read Also: Inter Exam Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఆ రోజే..

అయితే, తాజాగా గచ్చిబౌలి పోలీసుల నోటీసులపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ స్పందించింది. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. పోలీసుల విచారణకు తాను పూర్తిగా సహకరించినట్లు తెలిపింది. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు వివరణ ఇస్తాను.. ఇక, నేను ఎలాంటి పోస్టు చేయలేదు.. హాయ్ హైదరాబాద్ ట్వీట్ ను రీపోస్ట్ మాత్రమే చేశాను.. నేను చేసినట్లే, సోషల్ మీడియాలో దాదాపుగా 2 వేల మంది కూడా రీపోస్టు చేశారు.. మరి వాళ్లందరిపైనా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారా అని క్వశ్చన్ చేసింది. చట్టం అందరికీ సమానమా? ఎంపిక చేసిన వారినే టార్గెట్‌ చేస్తున్నారా? అంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ నిలదీశారు.

Exit mobile version