NTV Telugu Site icon

HYDRA Demolition: మూసీ వైపు దూసుకెళ్లనున్న హైడ్రా బుల్డోజర్లు.. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ఫోకస్..!

Hydra

Hydra

HYDRA Demolition: మూసీ నది వైపు హైడ్రా బుల్‌డోజర్లు దూసుకెళ్లనున్నాయి. ఈ వీకెండ్ లో మూసి రివర్ ఆక్రమణల కూల్చివేతలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే శని, ఆదివారాల్లో భారీగా మూసి ఆక్రమణల కూల్చివేతలు కొనసాగించనుంది. రెండు రోజుల్లో కూల్చివేతలు ఫినిష్ చేసేలా హైడ్రా టార్గెట్ పెట్టుకుంది. డే అండ్ నైట్ కూల్చివేతలు చేసేలా హైడ్రాకు అదనంగా సిబ్బందిని నియమించుకుంది. గోల్నాక, చాదర్ ఘాట్, మూసారంబాగ్ ఏరియాల్లో మూసి ఆక్రమణల కూల్చివేతకు రంగం సిద్ధం చేసింది.

Read Also: Hyundai IPO: ఇన్వెస్టర్స్ గెట్ రెడీ.. అతిపెద్ద ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్..

కాగా, హైడ్రా అధికారులు ఇప్పటికే 1350 మందికి నోటీసులు జారీ చేసింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఇళ్లను మార్క్ చేసిన హైడ్రా.. మూసి నివాసితుల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయింపు చేసింది. నేడు మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో మూసి నివాసితుల ప్రాంతాలకు కలెక్టర్లు వెళ్ళనున్నారు. మూసి ఆక్రమణల వివరాల సేకరణను ఇప్పటికే రెవెన్యూ, హైడ్రా అధికారులు ప్రారంభించారు. వారం రోజుల్లో ప్రజలను ఒప్పించి ఇళ్లను ఖాళీ చేయించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.