Site icon NTV Telugu

HYDRA Tweet: కూల్చివేతలపై తప్పుడు వార్తలు.. హైడ్రా కీలక ప్రకటన

Hydra

Hydra

HYDRA Tweet: హైదారబాద్ లో ఆక్రమణల కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన చేసింది. అనుమతులు ఉన్న వారు భయపడాల్సిన అవసరం లేదని ట్వీట్ చేశారు. చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యే అనుమతులు ఉన్న అన్ని రియల్ ఎస్టేట్ వెంచర్లు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. సరస్సులు, చెరువుల సమీపంలో అన్ని అనుమతులున్న నిర్మాణాలను కూడా కూల్చివేస్తారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. చెల్లుబాటు అయ్యే అనుమతులు ఉన్న ఏ నిర్మాణాన్ని కూల్చివేయబోమని తెలంగాణ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హైడ్రా ఈ ఆదేశానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటుందని ట్విటర్ వేదికగా వెల్లడించింది. హైదరాబాద్ లోని బఫర్ జోన్, ఎఫ్ టీఎల్ పరిధిలో ఆక్రమణలకు గురైన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. హైడ్రామా కూల్చివేతపై కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నక్రమంలో హైడ్రా వివరణ ఇచ్చింది.

Kunamneni Sambasiva Rao: రాష్ట్రంలో ఎటు చూసినా ఇబ్బంది వాతావరణం.. కూనంనేని కీలక వ్యాఖ్యలు

Exit mobile version