NTV Telugu Site icon

HYDRA: తుమ్మిడి చెరువు మరోవైపు ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్న హైడ్రా..

Hich City

Hich City

HYDRA: హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ లోని టాలీవుడ్ హీరో కింగ్ నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత పనులు పూర్తి అయ్యాయి.
పూర్తి స్థాయిలో నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. నిర్మాణాల కూల్చివేత పూర్తి కావడంతో భారీ యంత్రాలు వెనుతిరిగాయి. సుమారు నాలుగు గంటల పాటు ఈ కూల్చివేత ప్రక్రియ కొనసాగింది. అయితే, తుమ్మిడి కుంట చెరువుకు మరో వైపు ఉన్న గుడిసెలను తొలగించేందుకు సైతం హైడ్రా అధికారులు సిద్ధమైయ్యారు.

Read Also: Bangladesh : రాత్రి ఆలయాన్ని బద్దలు కొట్టేందుకు ప్రయత్నించిన ముస్లిం వ్యక్తి.. ఏం చేశారంటే ?

తుమ్మిడి కుంట చెరువుకు మరోవైపు ఉన్న తాత్కాలిక నిర్మాణాలను కూడా భారీ బందోబస్తు నడుమ హైడ్రా అధికారులు కూల్చి వేస్తున్నారు. అక్రమంగా నిర్మించిన కట్టడాలను సైతం వరుసగా కూల్చి వేస్తున్నారు. అక్రమంగా చెరువు స్థలంలో బోర్లు వేసి అక్రమార్కులపై కూడా అధికారులు కొరఢా ఝులిపిస్తున్నారు. ఆ బోరు ద్వారా నీటి ట్యాంకర్లతో సిటీలో అమ్ముకుంటూ దందా చేస్తున్న అక్రమార్కులు.. ఈ అక్రమ బోర్లను తొలగించేందుకు సైతం హైడ్రా అధికారులు సిద్ధమైయ్యారు.

Show comments