Site icon NTV Telugu

HYDRA In Ameenpur: అమీన్పూర్ పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లో హైడ్రా సర్వే..

Ameenpur

Ameenpur

HYDRA In Ameenpur: అమీన్పూర్ పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లో హైడ్రా, రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. హెచ్ఎంటీ, స్వర్ణపురి కాలనీలలోని సర్వే నెంబర్ 193, 194 & 323లలో రెవెన్యూ, పోలీస్ అధికారులతో కలిసి హైడ్రా సర్వే నిర్వహిస్తుంది. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో గత రెండు రోజుల క్రితమే ప్రభుత్వ స్థలంలో మూడు బహుళ అంతస్తుల నిర్మాణాలతో పాటు 25 విల్లాలను హైడ్రా అధికారులు కూల్చి వేశారు.

Read Also: Ayodhya Coco Cola Company: అయోధ్యలో మత సంప్రదాయాలను దెబ్బతీసే ఉదంతం..

అలాగే, హైడ్రా అధికారుల ఆదేశాల మేరకు అనుమతులకు మించి నిర్మించిన నాలుగు అంతస్తుల భవనాన్ని అమీన్ పూర్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారి పవన్ ఆధ్వర్యంలో కూల్చి వేతలు కొనసాగిస్తున్నారు. జీ+ 2 కోసం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ నుంచి అనుమతులు తీసుకుని అదనంగా రెండు అంతస్తులను నిర్మించడంతో నోటీసులు జారీ చేసి జేసీబీలతో కూల్చి వేస్తున్నట్లు టీపీఓ పవన్ తెలిపారు. అక్రమ నిర్మాణాలను సహించేది లేదని.. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టిన కూల్చివేతలు తప్పవని ఆయన హెచ్చరికలు జారీ చేశారు.

Exit mobile version