NTV Telugu Site icon

N Convention Demolish: మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత..

N Convension

N Convension

N Convention Demolish: హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ ఎన్​ కన్వెన్షన్ ను హైడ్రా బృందం కూల్చి వేస్తోంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎన్​ కన్వెన్షన్​ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్​ కన్వెన్షన్ ను అధకారులు కూల్చివేస్తున్నారు. తుమ్మిడిహడ్డి చెరువును కబ్జా చేసి ఎన్​ కన్వెన్షన్ నిర్మించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో తుమ్మిడిహడ్డి చెరువులోని మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి ఎన్​ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు చేశారు. ఇక, తుమ్మిడిహడ్డి చెరువు ఎఫ్ టీఓల్ లో ఎన్​ కన్వెన్షన్ నిర్మించారని గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో తాజాగా ఎన్​ కన్వెన్షన్ అక్రమ కట్టడాలను కూల్చి వేస్తుంది.