TG High Court: నేడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టు ముందు హాజరుకానున్నరు. అమీన్ పూర్ లో హాస్పిటల్ కూల్చివేత పై రంగనాథ్ హైకోర్టుకు వివరణ ఇవ్వనున్నారు. కోర్టులో పెండింగ్ లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని హైకోర్టు సీరియస్ అయ్యింది. దీంతో ఇవాళ హైకోర్టుకు రంగనాథ్ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. రంగనాథ్ వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు. అయితే అమీన్ పూర్ కూల్చివేతలపై రంగనాథ్ ఎలాంటి సమాచారం ఇస్తారనే దానిపై ఆశక్తి నెలకొంది. కాగా సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం శ్రీకృష్ణానగర్‌లో మహమ్మద్ రఫీకి చెందిన ఆసుపత్రి భవనం కూల్చేయడంపై ఇటీవల హైకోర్టు సీరియస్ అయిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 5వ తేదీన తాము ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ తహసిల్దార్, హైడ్రా కూల్చివేతలు చేపట్టడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. ఉత్తర్వుల ఉల్లంఘనపై తహసిల్దార్, హైడ్రా కమిషనర్ వ్యక్తిగతంగా లేదా వర్చువల్‌గా కోర్టుకు హాజరై సమాధానం చెప్పాలని హైకోర్టు ఆదేశించింది.
Instagram Reels Crazy: ఇన్‌స్టా రీల్స్ పిచ్చి..! కాలువలోకి దిగి విద్యార్థి గల్లంతు..
TG High Court: నేడు హైకోర్టు ముందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్..
- నేడు హైకోర్టు ముందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్..
- అమీన్ పూర్ లో హాస్పిటల్ కూల్చివేత పై హైకోర్టుకు వివరణ ఇవ్వనున్న రంగనాథ్..
- కోర్టులో పెండింగ్ లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని హైకోర్టు సీరియస్..
- రంగనాథ్ వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు..
Show comments