TOS Pub: హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్- 3లోని టాస్ పబ్‌లో పోలీసులు తనిఖీలు చేశారు. గత కొంతకాలంగా యువతులను ఎరగా వేసి యువకులతో భారీగా మద్యం తాగిస్తూ వారు మద్యం మత్తులోకి జారుకోగానే ఇష్టానుసారంగా బిల్లులు వసూలు చేస్తున్నట్లు తెలియడంతో.. రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. ఈ పబ్‌పై దాడులు చేసి అర్ధనగ్న నృత్యాలు చేస్తూ 142 మందిని పట్టుకోగా అందులో 42 మంది యువతులు, 100 మంది యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అలాగే, పబ్ యజమానులు బింగి బలరాం గౌడ్, బింగి శ్రీనివాస్‌గౌడ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Also: Dhoom 4 : ధూమ్ 4 అప్ డేట్.. ప్రియురాలు ఎవరు ? ఛేజ్ చేసేది ఎవరు ?
వీరితో పాటు డీజే ప్లేయర్ ఆసిఫ్, నలుగురు బౌన్సర్లు, మేనేజర్, బార్ టెండర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న 42 మంది యువతుల్లో 10 మంది తరచూ పట్టుబడుతుండటంతో వారిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పబ్‌ను డ్యాన్స్‌ఫ్లోర్‌గా మార్చి నిబంధనలు అతిక్రమించిన యజమానులు బింగి బలరాం గౌడ్, శ్రీనివాస్ గౌడ్‌లను అరెస్ట్ చేయడమే కాకుండా పబ్‌ను సీజ్ చేయాలని ఆర్డీవోకు లేఖ రాశారు. లైసెన్స్‌ను రద్దు చేయాలని కూడా ఎక్సైజ్ అధికారులకు లేఖ రాసినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు.