NTV Telugu Site icon

Hyderabad CP: వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలే.. పోలీసులకు సీపీ వార్నింగ్‌..

Hyderabad Cp

Hyderabad Cp

Hyderabad CP: పోలీసుల అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. లంచాలు, వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మార్చుకోని ఉన్నతాధికారులపై నిఘా ఉంచుతామని కొత్తకోట శ్రీనివాస్ అన్నారు. ఆరోపణ నిజమైతే ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగిస్తామని హెచ్చరించారు. కాగా.. హైదరాబాద్‌లో మరోసారి భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటంతో నగర పౌరులకు సీపీ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల బోయినపల్లిలో రూ.8.5 కోట్ల విలువైన 8.5 కిలోల మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ మీడియాకు వివరాలు వెల్లడించారు.

Read also: Telangana Governor: నేడు ములుగు, భూపాలపల్లిల్లో రాష్ట్ర గవర్నర్ పర్యటన

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నగరంలో యాంఫెటమైన్ అనే డ్రగ్ పెద్ద మొత్తంలో పట్టుబడిందన్నారు. ఈ మందులను ఇంజక్షన్లు, లిక్విడ్ రూపంలో వివిధ రూపాల్లో తీసుకుంటున్నట్లు సీపీ తెలిపారు. కూల్ డ్రింక్స్ లో అమ్మాయిలకు ఈ మందు ఇస్తున్నారని తెలిపారు. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఎవరిపైనా అయిన అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. నగర యువత డ్రగ్స్ బారిన పడవద్దని హెచ్చరించారు. ఈ కేసులో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి వారిపై ఉక్కుపాదం మోపాలని సీపీ శ్రీనివాస్ అన్నారు.

Read also: MLC Kavitha: నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ..

పార్టీలకు వెళ్లే యువత జాగ్రత్తగా ఉండాలన్నారు. తెలిసో తెలియకో ఎవరో ఒకరు డ్రగ్స్ ను అలవాటు చేసేందుకు పాల్పడుతుంటారని అన్నారు. కూల్ డ్రింక్స్ లో కలుపుతారని.. కాబట్టి యువత పార్టీల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొత్తగా డ్రగ్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ పరీక్షల కోసం TSNAB ప్రత్యేకంగా ఒక కిట్‌ను రూపొందించింది. డ్రగ్స్ వినియోగదారులు, గంజాయి వినియోగదారులను గుర్తించడానికి ఎబోన్ యూరిన్ కప్ యంత్రంతో పరీక్షలు నిర్వహించబడతాయి. ఈ కిట్‌ను ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్‌లకు పంపించారు. సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే కొన్ని పోలీస్ స్టేషన్లలో పరీక్షలు ప్రారంభమయ్యాయి.
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు..