Site icon NTV Telugu

Hyderabad Metro: మెట్రో ఎక్స్ అకౌంట్ హ్యాక్.. యాజమాన్యం కీలక సూచన..

Hyderabad Metro

Hyderabad Metro

Hyderabad Metro: ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణించే వ్యవస్థ హైదరాబాద్ మెట్రో.. అలాంటి కంపెనీ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాను కొందరు దుర్మార్గులు హ్యాక్ చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ అధికారిక X ఖాతా (@ltmhyd) సెప్టెంబర్ 19 ఉదయం హ్యాక్ అయినట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. ఎలాంటి లింక్‌లపై క్లిక్ చేయవద్దని.. ఎవరూ తమ X ఖాతాను సంప్రదించడానికి ప్రయత్నించవద్దని కోరారు. ఖాతాను త్వరగా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఇది హ్యాక్ అకౌంట్ అని హ్యాకర్ దుండగులు స్వయంగా ట్వీట్ చేయడం గమనార్హం. క్రిప్టో కరెన్సీ టోకెన్‌ను కొనుగోలు చేయడానికి హ్యాకర్లు క్రిప్టో వాలెట్ సైట్ చిరునామాను కూడా షేర్ చేశారు. హ్యాకింగ్ ఘటనపై వెంటనే అప్రమత్తమైన ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎక్స్ ఖాతాలో కనిపించే ఎలాంటి లింక్‌లపై క్లిక్ చేయవద్దని మెట్రో అధికారులు సూచించారు. తదుపరి అప్‌డేట్ వచ్చే వరకు పోస్ట్‌లతో జాగ్రత్తగా ఉండాలని ఖాతాని కోరారు. ట్వీట్‌లో క్రిప్టో కరెన్సీ టోకెన్ చిరునామా “ఇప్పుడే కొనండి!” హ్యాకర్లు రాశారు. మెట్రో ప్రయాణికులను తప్పుదోవ పట్టించి క్రిప్టో స్కామ్ చేయాలనే ఉద్దేశంతో హ్యాకర్లు ఈ పని చేశారు. సోషల్ మీడియా వేదికలపై మోసం చేసేందుకు ప్రయత్నించారు.

Read also: Hyderabad Crime: యు నాటీ.. ఆడవేషంలో గజ దొంగ.. టార్గెట్ చేస్తే వదలడు..


Vikarabad Crime: వికారాబాద్ లో దారుణం.. తల్లిని చంపిన కసాయి కొడుకు..

Exit mobile version