Metro Google Wallet: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి గూగుల్ వ్యాలెట్..
- హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో సౌకర్యం..
- ప్రయాణికులు సులువుగా మెట్రో టిక్కెట్లను బుక్ చేసుకునేలా 'గూగుల్ వాలెట్'..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Metro Google Wallet: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మెట్రో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్డేట్ చేస్తున్నామని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రయాణికులు సులువుగా మెట్రో టిక్కెట్లను బుక్ చేసుకునేలా రూపొందించిన ‘గూగుల్ వాలెట్’ను ఎన్వీఎస్ రెడ్డి ప్రారంభించారు. రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ (ఆర్సీఎస్) టెక్నాలజీని ఉపయోగించి రూపొందించిన ఈ వాలెట్‌తో ప్రయాణికులు క్యూలో నిలబడి టిక్కెట్లు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదని తెలిపారు. దీంతో సులభ ప్రయాణానికి కూడా దోహదపడుతుందని ఎన్వీఎస్ రెడ్డి అన్నారు.
Read also: Kasthuri: “నటి కస్తూరిపై కేసు”.. 4 సెక్షన్లలో ఎఫ్ఐఆర్ నమోదు
Also Read
హైదరాబాద్ నగరవాసులకు మెట్రో రైలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు అనేక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ముందుకు వెళ్తున్నామని మెట్రో ఎండీ తెలిపారు. మెట్రో రైలు విస్తరణతో హైదరాబాద్ నలుమూలల నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రయాణం సులువుగా మారుతుందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అదే సమయంలో, రూట్ మొబైల్, ఎల్ అండ్ టి మెట్రో రైల్ హైదరాబాద్ ప్రయాణికులకు ప్రత్యేకమైన టికెటింగ్ అనుభవాన్ని అందించడానికి ముంబైకి చెందిన ఇంటిగ్రేషన్ భాగస్వామి బిల్లేసీ ఇసొల్యూషన్స్ (బిల్లీసీ)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ చొరవ రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ (RCS), Google Wallet సేవలను అందిస్తుంది. ప్రయాణికులు సులభంగా ఇ-టికెట్లను బుక్ చేసుకోవడానికి, వాటిని Google Walletలో సేవ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ వినూత్న పరిష్కారం మెట్రో టికెటింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది, ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన,సమర్థవంతమైన ప్రయాణాలను అందిస్తుంది.
Prabhas-Spirit: ‘స్పిరిట్’ మూవీ అప్డేట్.. షూటింగ్ ప్రారంభం ఎప్పుడంటే?
తాజావార్తలు
-
Ramayana Box Office Collections: బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మొదటి భారతీయ చిత్రంగా అరుదైన ఘనత!
-
iTDP and YSRCP: రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్లొద్దు.. ఐటీడీపీ, వైసీపీ కీలక ప్రకటనలు!
-
Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు కానిస్టేబుల్ బలి..!
-
Supreme Court Judgment: ప్రభుత్వ ఉద్యోగి 48గంటలు కస్టడీలో ఉంటే సస్పెండయినట్టే..
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
ట్రెండింగ్
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?
-
AFG vs ZIM: రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 500+ పరుగులు.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే..! అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ డ్రా..
-
India vs New Zealand 3rd ODI: భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేపై వరుణుడి దెబ్బ.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్..!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 7,050mAh+ బ్యాటరీతో Xiaomi 18 Pro సిరీస్ గ్లోబల్ లాంచ్ డేట్ ఫిక్స్..!