Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- ఆడపడుచు కళ్లల్లో ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్
- సూరారం మల్లారెడ్డి ఆస్పత్రి ఎదుట ప్లాన్ అమలు
- 48 గంటల్లో నిందితుల్ని పట్టుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆడపడుచు కళ్లల్లో ఆనందం కోసం ఓ కిలాడీ కంత్రీ స్కెచ్ గీసింది. ప్లాన్ అమలుకు అర్ధరాత్రి సమయాన్ని ఎంచుకుంది. పక్కా ప్రణాళికతో కిడ్నాప్ ప్లాన్ అమలు చేసింది. పాపం పండి చివరికి కటకటాలపాలైంది. అసలు.. స్కెచ్ ఏంటి? కిడ్నాప్ ఏంటి? ఎప్పుడు? ఎక్కడ జరిగింది?. నిందితుల్ని పోలీసులు ఎలా పట్టుకున్నారో తెలియాలంటే ఇంట్రెస్టింగ్ వార్త చదవాల్సిందే.
హైదరాబాద్‌లోని సూరారం ప్రాంతం. రెండు రోజుల క్రితం.. మే 4న మల్లారెడ్డి ఆస్పత్రి ఎదురుగా ఉన్న పుట్‌పాత్‌పై నిద్రస్తున్న 6 నెలల పాప కిడ్నాప్‌కు గురైంది. తల్లిదండ్రుల పక్కను నిద్రస్తున్న చిన్నారిని చప్పుడు లేకుండా ఎత్తుకెళ్లిపోయారు. లేచి చూసేసరికి బిడ్డ కనిపించకపోవడంతో బాధిత తల్లిదండ్రులు ఆందోళన చెందారు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు.. నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌లో చిన్నారి కిడ్నాప్ దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో నిందితుల కోసం గాలింపు చేపట్టగా 48 గంటల్లోనే శ్రీదేవి అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు సహకరించిన మరో నలుగురు నిందితులను కూడా అరెస్ట్ చేశారు.
Also Read
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
- Rich Girls Trap Case: రిచ్ కిడ్స్ ట్రాప్ అండ్ రే*ప్ కేస్ లో సంచలన అంశాలు.. 25 మంది రిచ్ మైనర్ బాలికలను ట్రాప్ చేసి..
- Harish Rao : యూరియా అమ్మకాలపై ఆంక్షలు దారుణం..
- Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ బిగ్ డెసిషన్స్..!
ఇక ప్రధాన నిందితురాలు శ్రీదేవిని విచారించగా సంచలన విషయాలు వెల్లడించింది. తన ఆడపడుచుకు పిల్లలు లేరని.. దీంతో నిత్యం కృంగిపోతుందని.. ఆమె బాధను చూడలేక.. ఆడపడుచు కళ్లల్లో ఆనందం కోసం చిన్నారిని కిడ్నాప్ చేసినట్లుగా చెప్పుకొచ్చింది.
శ్రీదేవితో పాటు నలుగురు నిందితులంతా కర్ణాటక వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా రాజేంద్రనగర్ ప్రాంతంలో శ్రీదేవి పనిచేసే క్యాటరింగ్ సంస్థలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం శ్రీదేవి మైలార్‌దేవ్‌పల్లిలో నివాసం ఉంటుంది. తన ఆడపడుచు కోసం ఎలాగైనా ఒక బిడ్డను బహుమతిగా ఇవ్వాలన్న ఆలోచనతో ఈ కిడ్నాప్ చేసినట్లుగా నిందితురాలు వివరించింది.
తాజావార్తలు
-
Bengal Political Crisis: మమత కోటలో అధికారులు ఖాళీ.. మాజీ సీఎస్ నుంచి అడ్వకేట్ జనరల్ వరకు వరుసగా రాజీనామాలు!
-
VIJAY: ప్రమాణస్వీకారానికి ముందు విజయ్‌కు బిగ్ షాక్.. PMLA కేసు దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం..
-
Nithiin : ఎట్టకేలకు సినిమా మొదలెట్టిన నితిన్
-
India-Pakistan: “పాకిస్తాన్‌తో ఆడేది లేదు”.. కేంద్రం సంచలన నిర్ణయం..
-
Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!