NTV Telugu Site icon

Hyderabad : హైదరాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..

Vanastalipuram

Vanastalipuram

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. ఈరోజు తెల్లవారు జామున మరో అగ్ని ప్రమాదం జరిగింది.. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ని వనస్థలిపురం లో ఓ ఫర్నిచర్ వేర్ హౌస్ లో మంటలు అంటుకున్నాయి. హస్తినాపురంలో ఉన్న ఫర్నిచర్ వేర్ హౌస్ లో జరిగిన అగ్నిప్రమాదంతో హుటాహుటిన అగ్నిమాపక వాహనాలు వచ్చాయి.. ఫర్నిచర్ వేర్ హౌస్ లో పెద్ద ఎత్తున మంటలు అంటుకోవడం తో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు.. ఈ ప్రమాదం పై సమాచారం అందడటంతో అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణాలు ఏంటోనని దర్యాప్తు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. రాత్రి 9గంటలకు యజమానులు దుకాణాలను మూసేసి వెళ్లిన గంట తర్వాత అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాధాన్ని గమనించిన స్థానికులు వస్త్రషోరూం యజమాని, పోలీసులు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, విపత్తు ప్రతిస్పందన బృందం ఘటనాస్థలికి చేరుకుని, 4 ఫైరింజన్లతో మూడు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పేశారు. ప్రమాద స్థలంలో ఎవ్వరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని పోలీసుల విచారణలో వెళ్లడయింది.. ఇలాంటి ఘటనలు ఆ ప్రాంతంలో వరుసగా జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.. అధికారులు ఈ ప్రమాధాల కు కారణం ఏంటో గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు..

అయితే సుమారు రూ. 5కోట్ల విలువైన వస్త్రాలు, ఫర్నిచర్‌ సామగ్రి దగ్ధమైందని యజమాని ముక్తేశ్వర్‌ విలేకరుల కు తెలిపారు. విజయవాడ జాతీయ రహదారి సమీపంలోనే ఈ షోరూములు ఉండడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. వస్త్రదుకాణం మూసే సమయానికి మెయిన్‌ ఆపేశామని, విద్యుదాఘాతం అయ్యే అవకాశం లేదని షాపు యజమాని తెలిపారు. షాపుస్థలం కోర్టు వివాదంలో ఉందని ఎవరైనా ఉద్దేశ పూర్వకంగానే ఇలా చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.. ఈ ఘటన పై పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తును ప్రారంభించారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..