Hyderabad : హైదరాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. ఈరోజు తెల్లవారు జామున మరో అగ్ని ప్రమాదం జరిగింది.. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ని వనస్థలిపురం లో ఓ ఫర్నిచర్ వేర్ హౌస్ లో మంటలు అంటుకున్నాయి. హస్తినాపురంలో ఉన్న ఫర్నిచర్ వేర్ హౌస్ లో జరిగిన అగ్నిప్రమాదంతో హుటాహుటిన అగ్నిమాపక వాహనాలు వచ్చాయి.. ఫర్నిచర్ వేర్ హౌస్ లో పెద్ద ఎత్తున మంటలు అంటుకోవడం తో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు.. ఈ ప్రమాదం పై సమాచారం అందడటంతో అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణాలు ఏంటోనని దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. రాత్రి 9గంటలకు యజమానులు దుకాణాలను మూసేసి వెళ్లిన గంట తర్వాత అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాధాన్ని గమనించిన స్థానికులు వస్త్రషోరూం యజమాని, పోలీసులు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, విపత్తు ప్రతిస్పందన బృందం ఘటనాస్థలికి చేరుకుని, 4 ఫైరింజన్లతో మూడు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పేశారు. ప్రమాద స్థలంలో ఎవ్వరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని పోలీసుల విచారణలో వెళ్లడయింది.. ఇలాంటి ఘటనలు ఆ ప్రాంతంలో వరుసగా జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.. అధికారులు ఈ ప్రమాధాల కు కారణం ఏంటో గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు..
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
అయితే సుమారు రూ. 5కోట్ల విలువైన వస్త్రాలు, ఫర్నిచర్ సామగ్రి దగ్ధమైందని యజమాని ముక్తేశ్వర్ విలేకరుల కు తెలిపారు. విజయవాడ జాతీయ రహదారి సమీపంలోనే ఈ షోరూములు ఉండడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వస్త్రదుకాణం మూసే సమయానికి మెయిన్ ఆపేశామని, విద్యుదాఘాతం అయ్యే అవకాశం లేదని షాపు యజమాని తెలిపారు. షాపుస్థలం కోర్టు వివాదంలో ఉందని ఎవరైనా ఉద్దేశ పూర్వకంగానే ఇలా చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.. ఈ ఘటన పై పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తును ప్రారంభించారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
తాజావార్తలు
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!