NTV Telugu Site icon

Kolkata Doctor Case: ఆందోళనకు ఐఎంఏ పిలుపు.. ఇందిరాపార్కులోని ధర్నాచౌక్‌ వద్ద ధర్నా..

Kolkata Doctor Case

Kolkata Doctor Case

Kolkata Doctor Case: కలకత్తా వైద్యురాలు పై జరిగిన హత్యాచారం నేపథ్యంలో 24 గంటల పాటు దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్ చేయనున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు నిరసనలో వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్, మొత్తం వైద్య సిబ్బంది పాల్గొంటున్నారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తాత్కాలిక సేవలను ప్రభుత్వ వైద్యులు నిలిపివేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే జూడాలు ఓపీ సేవలను బహిష్కరించారు. ఇటు అన్ని ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా OP, తాత్కాలిక సేవలను నిలిపివేసి ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొలకత్తా ఘటనపై వైద్యులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం ప్రకటించింది.

Read also: Harish Rao Flexi: సిద్దిపేటలో అర్ధరాత్రి టెన్షన్ వాతావరణం..

ఇవ్వాళ రాష్ట్రంలో అన్ని ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ సేవలు మినహా… అన్ని సేవలు బహిష్కరించి ఇందిరాపార్క్ లోని ధర్నా చౌక్ వద్ద ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వైద్యులు ఆందోళకు దిగనున్నారు. అందుకు రాష్ట్రవ్యాప్తంగా వైద్య సంఘాల ఆధ్వర్యంలో వైద్యులను పెద్ద ఎత్తున కదిలిరానున్నారు. నిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఇవ్వాళ 9గంటలకు నిమ్స్ బంజారాహిల్స్ గేట్ దగ్గర నుంచి మాసబ్ ట్యాంక్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. డెంటల్ డాక్టర్లు పరెడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ నుంచి సికింద్రాబాద్ క్లాక్ టవర్ వరకు ర్యాలీ చేపట్టనున్నారు. ఇవ్వాళ ఉదయం 10 గంటలకు ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులతో సహా అన్ని ఆస్పత్రుల జూడాలు, IMA వైద్యులు ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టనున్నారు.

Read also: Sabarmati Express: కాన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్..

జూడాల ఆందోళనకు పిలుపుతో రాష్ట్ర పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జూడాలు రోడ్డుల వచ్చి ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా నిరసనలు చేపట్టాలని తెలిపారు. ఎవరికి ఇబ్బందులు తావులేకుండా శాంతియుతంగా ధర్నా చేయాలని పోలీసులు సూచించారు. ధర్నా చౌక్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సికింద్రాబాద్ వద్ద కూడా పోలీసులు భారీగా చేరుకున్నారు.
CM Chandrababu Delhi Tour: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ.. నేడు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతో భేటీ..

Show comments