NTV Telugu Site icon

Nizam College: అబిడ్స్ లో ఉద్రిక్తత.. విద్యార్థుల ఆందోళనతో భారీ ట్రాఫిక్‌ జామ్‌

Nizam College

Nizam College

Nizam College: నిజాం కాలేజ్ గర్ల్ హాస్టల్ లో యూజీ విద్యార్థినిలకు మాత్రమే అడ్మిషన్లు ఇవ్వాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ బషీర్ బాగ్ లో చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించారు. దీనితో లిబర్టీ నుండి అబిడ్స్ వెళ్లే మార్గం ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విద్యార్థులు ప్రిన్సిపాల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిజాం కాలేజీలో 2022 లో యూజీ విద్యార్థిలకు గర్ల్స్ హాస్టల్ నిర్మించారని తెలిపారు.

Read also: Neeraj Chopra: రేపే క్వాలిఫికేషన్ రౌండ్‌.. ‘గోల్డ్’ ఆశలు నీరజ్‌ చోప్రా పైనే! భారత్ నుంచి మరో ప్లేయర్

ఆ ఏడాది హాస్టల్ లో యూజీ విద్యార్థుల అడ్మిషన్లు తక్కువ ఉండటం వల్ల పీజీ విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చారన్నారు. అయితే ఈ ఏడాది యూజీ అడ్మిషన్లు ఎక్కువ వచ్చాయని… వారికి హాస్టల్ లో అడ్మిషన్ దొరకకపోవడంతో బయట ప్రేవేట్ హాస్టల్ లో ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్నామన్నారు. ప్రిన్సిపాల్ బయటకు వచ్చి , యూజీ వాళ్లకే హాస్టల్ అడ్మిషన్లు ఇస్తాని హామీని ఇస్తే నే ఆందోళన విరమిస్తామని విద్యార్థులు తెలిపారు.
Bangladesh Violence : బంగ్లాదేశ్‌లోని దేవాలయాలపై ఛాందసవాదుల దాడి .. ఇద్దరు హిందూ కౌన్సిలర్ల మృతి

Show comments