IMD Weathter: నేడు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడే ఛాన్స్..
- తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం..
- ఉరుములు- మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి..
- గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IMD Weathter: తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి మెదక్, ఉమ్మడి కరీంనగర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు అధికారులు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప పొలాలకు, బయట ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. పిడుగులు పడే అవకాశం కూడా ఉందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయి.
Read also: Dr MP Laxman: ఆ ఇద్దరి వల్లే దేశం రెండు ముక్కలు అయ్యింది..
Also Read
దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి గాలుల ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ఇదిలావుంటే.. గత నెల రోజులుగా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఏపీలోనూ కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. రిజర్వాయర్లు, ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. దాదాపు రెండేళ్ల తర్వాత శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం సాగర్ నుంచి గేటు ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం మీద ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
CM Revanth Reddy: కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా లెక్కలు తేలాల్సి ఉంది..
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!