Yellow Alert: అల్పపీడన ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది. ఈ క్రమంలో నేటి ( శుక్రవారం ) నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో అధికారులు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా, ఈరోజు (శుక్రవారం) సాయంత్రం ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. ముఖ్యంగా గంటకు 11 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.
Read also: Singareni Workers: ఎల్లో, రెడ్ వార్నింగ్ కార్డులు రద్దు చేయండి.. కార్మిక సంఘాల లేఖలు
దీంతో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు రానున్న మూడు రోజులపాటు చురుగ్గా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. అలాగే రానున్న మూడు రోజుల పాటు నగరంలో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నిన్న ( గురువారం )సాయంత్రం నుంచి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఈ భారీ వర్షం కారణంగా జూబ్లీహిల్, బంజారాహిల్స్ నుంచి రసూల్‌పురా, అమీర్‌పేట వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే రానున్న మూడు రోజుల పాటు నగరంలో ఇదే పరిస్థితి ఉంటుందని, భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తాజాగా పేర్కొంది.
Traffic Challans: హెల్మెట్ లేకుండా బైక్ నడిపినందుకు 11.5 లక్షల చలాన్లు..!