Site icon NTV Telugu

Heavy Rain: హైదరాబాద్ లో భారీ వర్షం.. ట్రాఫిక్ జామ్!

Rain

Rain

Heavy Rain: హైదరాబాద్‌ నగరంలో పలు చోట్ల వర్షం పడుతుంది. వాతావరణంలో మార్పుల వల్ల నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వాన కురుస్తోంది. కాగా, హైదరాబాద్ పరిధిలో బోరబండా, మాదాపూర్, నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్, జూబ్లిహిల్స్, సుల్తాన్ పూర్, మల్లంపేట్, గండి మైసమ్మ పరిసర ప్రాంతాలలో కురుస్తుంది వర్షం. అయితే, గత కొన్ని రోజులుగా నగరంలో ఎండలు తీవ్రరూపం దాల్చాయి. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపం చూపుతున్నారు. దీంతో పట్నం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు ఉక్కపోత.. మరోవైపు చెమటతో తీవ్ర అవస్థలు పడుతున్న సమయంలో హైదరాబాద్‌లో వర్షం కురవడం కాస్త ఉపశమం పొందుతున్నారు. అయితే, మరోవైపు రోడ్లపై వర్షం నీటితో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. నెమ్మదిగా వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి.

Read Also: Face Mask : మీ చర్మాన్ని బిగుతుగా చేసే మూడు అద్భుతమైన ఫేస్ మాస్క్‌లు

కాగా, ఎండలతో మండిపోతున్న వేళ తెలంగాణలోని ఆసిఫాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్‌, నిర్మల్ జిల్లాలో వర్షం కురుస్తుంది. ఈ ఆకాల వర్షాలు కురుస్తుండటంతో చేతికి వచ్చిన పంటలు నాశనం అవుతున్నాయని రైతున్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడగండ్ల వానలు పడుతుండటంతో వరి, మామిడి, చెరుకు పంటలు తీవ్రంగా నష్టపోయాయి.

Exit mobile version