హైదరాబాద్‌లో మంగళవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. హైదరాబాద్ సహా మరో 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు..
ఐఎండీ తాజా బులెటిన్ ప్రకారం.. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఎల్లో అలర్ట్..
ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Vice-President: తదుపరి ఉపరాష్ట్రపతిగా పేర్లు పరిశీలన..! ఆ పార్టీ నేతకు ఛాన్స్!
మంగళవారం హైదరాబాద్ మేఘావృతమై ఉంటుందని.. ఈ నేపథ్యంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని స్పష్టం చేసింది. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.
ఇది కూడా చదవండి: Mumbai: ముంబైలో దారుణం.. భర్తను చంపి ఇంట్లో పాతిపెట్టిన భార్య
ఇక భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ, పోలీసులు, హైడ్రా బృందాలు సిద్ధంగా ఉండాలని కోరారు. ఇక అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా గిరిజన ప్రాంతాలకు వైద్య బృందాలను పంపించాలని ఆదేశించారు.
