NTV Telugu Site icon

Heavy Flood Water: గండిపేట, హిమాయత్ సాగర్ కు భారీగా వరద ప్రవాహం..

Gandipet

Gandipet

Heavy Flood Water: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. కుండపోత వర్షాల ధాటికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక, రంగారెడ్డి జిల్లాలో జంట జలాశయాలు నిండు కుండలుగా కనిపిస్తున్నాయి. గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. గండిపేట (ఉస్మాన్ సాగర్) ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1789.90 అడుగులుగా ఉంది. శంకర్ పల్లి, పొద్దుటూర్, చేవెళ్ళ, మొయినాబాద్, మోకిలా ప్రాంతాల నుంచి భారీ వరద నీరు గండిపేట జలాశయానికి వచ్చి చేరుతుంది.

Read Also: Amazon Rain Forest : షాకింగ్.. అమెజాన్ అడవుల్లో రెండు దేశాలకు సమానమైన ప్రాంతాన్ని నరికేశారట

కాగా, హిమాయత్ సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1762.60 అడుగుల వద్ద కొనసాగుతుంది. తాండూర్, వికారాబాద్, షాబాద్, వెంకటాపూర్ నుంచి భారీగా వరద ప్రవాహం హిమాయత్ సాగర్ ప్రాజెక్ట్ కు చేరుతుంది. గండిపేట జలాశయంకు భారీగా వరద నీరు రావడంతో రెండు క్రస్ట్ గేట్లు ఫీట్ వరకు ఎత్తి నీటిని దిగివకు విడుదల చేసిన జల మండలి అధికారులు.