NTV Telugu Site icon

Vinayaka Nimajjanam: హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనంపై నేడు హైకోర్టులో విచారణ..

Hussain Gafar Nimajjananm

Hussain Gafar Nimajjananm

Vinayaka Nimajjanam: హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలపై మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయరాదని గతేడాది హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును ఈ ఏడాది కూడా కొనసాగించాలని సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైదరాబాద్‌లోని చెరువుల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా దీనికి బాధ్యత వహించాలని పిటిషనర్‌ హైడ్రా కమిషనర్‌ను ప్రతివాదిగా చేర్చారు. ఈ పిటిషన్‌పై ఇవాళ వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.

Read also: Thangalaan : తంగలాన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. చూడాలంటే షరతులు వర్తిస్తాయ్..

అయితే హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌, పలు రసాయనాలు కలిపిన రంగులతో తయారు చేసిన వేలాది వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల సాగర్‌ కలుషితం అవుతుందని గతేడాది హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ ఏడాది హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనాలు జరుగుతాయా లేదా అనే దానిపై ఇవాళ కోర్టులో తేలిపోనుంది. కాగా మరోవైపు వినాయక చవితి నుంచి మూడు రోజులుగా పూజలు చేసిన భక్తులు సోమవారం సాయంత్రం నిమజ్జనం చేశారు. పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన మండపాలలో గణేష్ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Show comments