NTV Telugu Site icon

Harisha Rao: ఖమ్మం వెళ్తే మాపై రాళ్ల దాడి చేయించారు.. హరీష్‌ రావు కీలక వ్యాఖ్యలు

Harish Rao

Harish Rao

Harisha Rao: ఖమ్మం వెళ్తే మాపై రాళ్ల దాడి చేయించారని మాజీ మంత్రి హరీష్‌ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా నీటిలో చిక్కుకున్న వారిని ప్రభుత్వం కాపడలేదు, వారికి వారే కాపాడుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 9 చోట్ల మత కలహాలు జరిగాయని అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై తెలంగాణ భవన్‌లో హరీశ్ రావు ఛార్జ్ షీట్ విడుదల చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఎడతెగని వంచన లాగా మారిందని హరీష్‌ రావు మండిపడ్డారు. ఇప్పుడు విజయోత్సవాలు కాదు.. వంచనోత్సవాలు జరపాలనీ కీలక వ్యాఖ్యలు చేశారు. బడికి వెళ్లే చిన్నారుల దగ్గర నుంచి పింఛన్లు అందుకునే అవ్వ తాతల వరకు, నిరుద్యోగుల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు అందరిని వంచించారని అన్నారు.

Read also: Braking News : మోహన్ బాబుపై చిన్న కొడుకు మంచు మనోజ్ ఫిర్యాదు

మీ ఏడాది పాలనలో ఒక్క చెక్ డ్యాం అయిన కట్టారా? ప్రతి సంవత్సరం 6 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఇస్తా అన్నారు.. ఇచ్చారా..? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేసిన వాటికి కొబ్బరి కాయ కొట్టి ప్రారంభిస్తున్నారని తెలిపారు. నిజంగా ముఖ్యమంత్రి పాలమూరు బిడ్డ అయితే పాలమూరు రంగారెడ్డిలో ఒక్క తట్టెడు మట్టి అయిన తీశారా? అని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ పెరిగింది.. రేవంత్ పాలనలో ఇర్రిటేషన్ పెరిగిందన్నారు. ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు.. అయ్యిందో కాలేదో ప్రజలకు తెలుసన్నారు. 4 కోట్ల ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి.. 3 కోట్ల దేవతలను మోసం చేయడా? అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read also: Arvind Kejriwal-Pushpa 2: పుష్ప-2 అవతారంలో అరవింద్ కేజ్రీవాల్.. తగ్గేదేలే?

రాష్ట్రంలో 50 శాతం రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. ముఖ్యమంత్రి సొంత గ్రామంలో మాజీ సర్పంచ్ రేవంత్ సోదరుల వల్లనే చనిపోతున్నాని లేఖ రాసినా.. చర్యలు తీసుకోలేదని హరీష్ అన్నారు. గాంధీ భవన్ ఇచ్చే సూచనలతోనే చట్టం పని చేస్తుందన్నారు. శాంతి భద్రతలతో వైఫల్యం ఏర్పడిందన్నారు. చెప్పని ఎన్నో పథకాలు గత ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు. బాండ్ పేపర్స్ పై రాసి ఇచ్చి మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని హరీష్‌ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. చెప్పని హామీలను నెరవేర్చిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. సంవత్సరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టారా? అని మాజీ మంత్రి హరీష్‌ రావు ప్రశ్నించారు. విద్య భరోసాకి, రైతు భరోసాకి పట్టిన గతి పట్టిందన్నారు.
Daku Maharaj : బాలయ్య నెక్ట్స్ మూవీలో మాస్ హీరో.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే ?

Show comments